యూనివర్శిటీ క్యాంపస్ లో విద్యార్థి దారుణ హత్య

Published : Apr 03, 2019, 10:43 AM IST
యూనివర్శిటీ క్యాంపస్ లో విద్యార్థి దారుణ హత్య

సారాంశం

బెనారస్ హిందూ యూనివర్శిటీ స్టూడెంట్ ఒకరు యూనివర్శిటీ క్యాంపస్ లో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణ సంఘటన వారణాసిలో చోటుచేసుకుంది. 

బెనారస్ హిందూ యూనివర్శిటీ స్టూడెంట్ ఒకరు యూనివర్శిటీ క్యాంపస్ లో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణ సంఘటన వారణాసిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

గౌరవ్ సింగ్ బెనారస్ హిందూ యూనివర్శిటీలో మాస్టర్స్ చేస్తున్నాడు. యూనివర్శిటీ క్యాంపస్ లోని లాల్ బహదూర్ శాస్త్రి హోటల్ లో ఉంటూ రోజూ యూనివర్శిటీకి వెళ్లేవాడు. కాగా.. మంగళవారం సాయంత్రం గౌరవ్ హాస్టల్ ముందు నిల్చొని తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. కాగా ఆ సమయంలోనే  .. బైక్ వచ్చిన కొందరు దుండగులు తుపాకీతో గౌరవ్ పై కాల్పులు జరిపారు.

దీంతో గౌరవ్ ని అతని స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాలతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు  చేపడుతున్నా రు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు

PREV
click me!

Recommended Stories

Nepal Floods: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? అసలు కారణమిదే..నేపాల్ లో మరోసారి బీభత్సం
ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం