ర్యాగింగ్ : విద్యార్థిని ఆత్మహత్య.. నలుగురు అమ్మాయిలకు జైలు..

By AN TeluguFirst Published Feb 6, 2021, 3:08 PM IST
Highlights

ర్యాగింగ్ కేసులో నలుగురు యువతులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లా కోర్టు శనివారం సంచలన తీర్పునిచ్చింది. ఎనిమిదేళ్ల కిందట జరిగిన ఈ కేసులో ఓ విద్యార్థినిని సదరు యువతులు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు రుజువవ్వడంతో జిల్లా న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. 

ర్యాగింగ్ కేసులో నలుగురు యువతులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లా కోర్టు శనివారం సంచలన తీర్పునిచ్చింది. ఎనిమిదేళ్ల కిందట జరిగిన ఈ కేసులో ఓ విద్యార్థినిని సదరు యువతులు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు రుజువవ్వడంతో జిల్లా న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. 

వివరాల్లోకి వెడితే..  ఓ ప్రైవేటు కాలేజీలో అనిత అనే విద్యార్థి  బీఫార్మసీ లో జాయిన్ అయ్యింది. అయితే అదే కాలేజీకి చెందిన నలుగురు సీనియర్ విద్యార్థినులు జూనియర్ అయిన అనితను ర్యాగింగ్ చేశారు. ఏడాది మొత్తం అలాగే ర్యాగింగ్ చేశారు. ఈ విషయాన్ని అనిత కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లింది కానీ వారు ఏ మాత్రం పట్టించుకోలేదు. 

దీంతో అనిత తీవ్ర మనస్థానం చెంది సూసైడ్ లెటర్ రాసి తనింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ లెటర్ లో తనను ర్యాగింగ్ చేసిన నలుగురు యువతుల పేర్లు రాసి, తన చావుకు వాళ్లే కారణమని ఆరోపణలు కూడా చేసింది. 

సూసైడ్ లేఖలో ‘నేను కాలేజీలో చేరినప్పటినుంచి ఈ నలుగురు అమ్మాయిలు నన్ను ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. ర్యాగింగ్ ను నేనెలా అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. కాలేజీలో సీనియర్లకు ఫిర్యాదు చేస్తే, సీనియర్లు కూడా అది సహజమేనని కొట్టిపడేశారు. కాలేజీ యాజమాన్యం కూడా స్పందించలేదు. నేను చనిపోయాక, సోదరుడు, తల్లిదండ్రులు నన్ను మిస్ కావద్దు’ అని రాసిపెట్టి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

ఈ ఘటన తర్వాత ఆ నలుగురు యువతులపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తాజాగా దీనిమీద న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థినులకు జైలుశిక్షను ఖరారు చేసింది. కోర్టు తీసుకున్న నిర్ణయం కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ఘటనలు జరగకుండా నిరోధించేలా కృషి చేయడానికి తోడ్పతుంది. 

click me!