భీమా కొరెగావ్ అల్లర్ల కేసు: వరవరరావు వ్యవహారంలో పుణే పోలీసుల కీలక నిర్ణయం

By Siva KodatiFirst Published Dec 26, 2019, 5:46 PM IST
Highlights

భీమా కొరెగావ్ కేసులో పుణే పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరవరరావు కేసులో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సహకారం తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

భీమా కొరెగావ్ కేసులో పుణే పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరవరరావు కేసులో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సహకారం తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

గతంలో వరవరరావు ఇంట్లో దొరికిన హార్డ్ డిస్క్ డ్యామేజ్ కావడంతో ఎఫ్‌బీఐ సహకారంతో అందులోని సమాచారాన్ని రిట్రేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. భీమా కొరెగావ్ కేసుకు సంబంధించి 2018 నవంబర్ 17న వరవరరావును పుణే పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.  ప్రధాని మోడీని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు వరవరరావుపై అభియోగాలు నమోదు  చేశారు.

Also Read:మోడీ హత్యకు కుట్ర: 'అరెస్టైన హక్కుల నేతల నుండి వందల లేఖలు'

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తరహాలో మోడీని హతమార్చేందుకు నిందితులు కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడి ఇంట్లో దొరికిన లేఖలో వరవరరావు పేరు దొరికిన సంగతి తెలిసిందే.

భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసినట్టుగానే ప్రధాని మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని మహారాష్ట్ర అడిషన్ డైరెక్టర్ జనరల్ పరంబీర్ సింగ్ గతేడాది ఆగస్టు 31న ప్రకటించారు. ఈ కేసులో అరెస్టైన పౌర హక్కుల సంఘాల నేతలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని  ఆయన  చెప్పారు. ఈ మేరకు తన వద్ద రుజువులు ఉన్నాయని చెప్పారు. 

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటు పుణెకు సమీపంలోని భీమా కోరెగావ్‌ గ్రామంలో జరిగిన హింస కేసులో విప్లవ రచయిత సంఘం(విరసం) నేత వరవరరావును, హక్కుల నేతలు వెర్నాన్‌ గోంజాల్వేస్‌, అరుణ్‌ ఫెరీరియా, సుధా భరద్వాజ్‌, గౌతమ్‌ నవలఖలను అరెస్టు చేశారు. అయితే సుప్రీంకోర్టు  తీర్పు నేపథ్యంలో వరవరరావు,గోంజాల్వేస్‌, ఫెరీరియాలను  గృహ నిర్భంధానికి పరిమితం చేశారు

Also Read:ఆయుధాలు దొరికే చోటు వరవరరావుకి తెలుసు: పూణే పోలీసులు

రాజీవ్‌గాంధీ తరహాలో మోదీని హత్య చేయాలని ప్రణాళికలు వేసినట్లు అరెస్టు అయిన పౌరహక్కుల నేతకు, మావోయిస్టులకు మధ్య లేఖల ద్వారా సంభాషణ జరిగిందన్నారు. గ్రనేడ్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా ఆ లేఖ‌లో ఉందన్నారు.  పౌరహక్కుల నేతల దగ్గర నుంచి కొన్ని వందల లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.   స్వాధీనం చేసుకున్న డిస్క్‌ల్లో ఒక రాకెట్‌ లాంచర్‌ పాంప్లెట్‌ లభ్యమైంది’ అని పరంబీర్‌ తెలిపారు.

click me!