భారత్ జోడో యాత్రలో భద్రత లోపం.. రాహుల్ గాంధీ వద్దకు దూసుకెళ్లిన వ్యక్తి..

By Sumanth KanukulaFirst Published Jan 17, 2023, 12:14 PM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భద్రత లోపం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని ఓ వ్యక్తి ఆయన వద్దకు దూసుకెళ్లాడు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భద్రత లోపం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని ఓ వ్యక్తి ఆయన వద్దకు దూసుకెళ్లాడు. రాహుల్‌ను కౌగిలించుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ వైరల్‌గా మారింది. అందులో పసుపు రంగు జాకెట్ ధరించిన వ్యక్తి రాహుల్ గాంధీ వైపు వచ్చి కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు ఆ వ్యక్తిని  అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో అనేక భద్రత ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన భద్రతపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనకు భద్రత పెంచాలని కూడా డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ఈ విధమైన డిమాండ్ చేసిన కొన్ని వారాలకే తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక, ప్రస్తుం రాహుల్ గాంధీకి ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. అంటే ఎనిమిది నుంచి తొమ్మిది మంది కమాండోలు ఆయనకు 24x7 కాపలాగా ఉన్నారు.

రాహుల్ గాంధీ తన యాత్రను ముగించే కాశ్మీర్‌కు వెళ్లే మార్గంలో భద్రతా సంస్థలు సున్నితమైన ప్రాంతంగా భావించే సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లోకి ప్రవేశించడంతో భద్రతాపరమైన ఆందోళనలు ముందుగా లేవనెత్తాయి.
 

click me!