ముఖ్యమంత్రి వ్యక్తిగత కారుకి ట్రాఫిక్ పోలీసులు ఫైన్

By Nagaraju penumalaFirst Published Feb 28, 2019, 9:05 AM IST
Highlights

రూల్స్ బ్రేక్ చేస్తే చలానా రాసే ట్రాఫిక్ పోలీసులు కర్ణాటక ముఖ్యమంత్రిని కూడా వదల్లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి చెందిన వ్యక్తిగత కారుకు సంబంధించి ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసును నమోదు చేశారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. 
 
బెంగళూరు: నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వాహనాలు నడిపినా చర్యలు తీసుకుంటామని అందుకు ఎవరూ అతీతులు కారని నిరూపించారు కర్ణాటకకు చెందిన ట్రాఫిక్ పోలీసులు. చట్టం ఎవరికి చుట్టం కాదని ముఖ్యమంత్రి అయినా సాధారణ పౌరుడు అయినా ఒక్కరేనని చట్టం అందరికీ సమానమేనని నిరూపించారు. 

రూల్స్ బ్రేక్ చేస్తే చలానా రాసే ట్రాఫిక్ పోలీసులు కర్ణాటక ముఖ్యమంత్రిని కూడా వదల్లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి చెందిన వ్యక్తిగత కారుకు సంబంధించి ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసును నమోదు చేశారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. 

అందులో భాగంగా బుధవారం సీఎం కార్యాలయానికి ట్రాఫిక్ విభాగం అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 23న పరిమితికి మించిన వేగంతో కారు వెళ్లిందని నోటీసులో పేర్కొన్నారు. 

అందుకు సంబంధించి రూ.300 జరిమానా చెల్లించాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత కారుకి ఫైన్ వెయ్యడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. 
 
click me!