నివాసయోగ్య నగరాల్లో బెంగళూరు ది బెస్ట్, కేంద్రం ర్యాంకులు.. హైదరాబాద్ ప్లేస్ ఇదే

By Siva KodatiFirst Published Mar 4, 2021, 5:14 PM IST
Highlights

దేశంలో నివాసయోగ్య నగరాల్లో కర్ణాటక రాజధాని, దేశ ఐటీ రాజధాని బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌’ సూచీ జాబితాను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.

దేశంలో నివాసయోగ్య నగరాల్లో కర్ణాటక రాజధాని, దేశ ఐటీ రాజధాని బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌’ సూచీ జాబితాను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.

మొత్తం 111 నగరాలతో ఈ జాబితా రూపొందించగా.. బెంగళూరు తొలి స్థానం నిలిచింది. ఆ తర్వాత పుణె, అహ్మదాబాద్‌, చెన్నై, సూరత్‌, నవీముంబయి, కోయంబత్తూర్‌, వడోదర, ఇండోర్‌, గ్రేటర్‌ ముంబయి టాప్‌ 10లో ఉన్నాయి.   

జనాభాను బట్టి ఈ జాబితాను రెండుగా విభజించారు. 10 లక్షల పైన జనాభా కలిగిన 49 నగరాల్లో బెంగళూరు టాప్‌లో ఉండగా.. మిలియన్‌ లోపు జనాభా కలిగిన 62 నగరాల్లో హిమాచల్ ప్రదేశ్‌ సిమ్లా అగ్రస్థానంలో నిలిచింది.

చిన్న నగరాల్లో సిమ్లా తర్వాత భువనేశ్వర్‌, సిల్వస్సా, కాకినాడ, సేలం, వెల్లూరు, గాంధీనగర్‌, గురుగ్రామ్‌, దావణగిరె, తిరుచిరాపల్లి టాప్‌ 10 ర్యాంకింగ్‌లు దక్కించుకున్నాయి.  ఇక ‘మున్సిపల్‌ పర్ఫామెన్స్‌ ఇండెక్స్‌’ మిలియన్‌ ప్లస్‌ జనాభా కేటగిరిలో ఇండోర్‌ అగ్రస్థానంలో ఉండగా.. పది లక్షల లోపు జనాభా కేటగిరిలో ఢిల్లీ టాప్‌గా నిలిచింది.

కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఈ ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. నగరాల్లో ప్రజలు జీవనం సాగించేందుకు అనుకూల పరిస్థితులను పరిగణనలోనికి అధ్యయనం చేసిన కేంద్రం తాజాగా ఈ ర్యాంకులను కేటాయించింది.   

click me!