బెంగళూరులో కరోనా టెర్రర్: 11 రోజుల్లో 543 పిల్లలకు పాజిటివ్.. సీఎం అత్యవసర సమావేశం

By Siva KodatiFirst Published Aug 13, 2021, 8:39 PM IST
Highlights

కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. 11 రోజుల్లో 543 మంది పిల్లలకు కోవిడ్ సోకింది. ఆగస్టు నెల మొదటి 10 రోజుల్లోనే నగరంలోని 543 మంది పిల్లలకు కరోనా సోకినట్లు బెంగళూరు నగరపాలక సంస్థ తెలిపింది.

కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. 11 రోజుల్లో 543 మంది పిల్లలకు కోవిడ్ సోకింది. ఆగస్టు నెల మొదటి 10 రోజుల్లోనే నగరంలోని 543 మంది పిల్లలకు కరోనా సోకినట్లు బెంగళూరు నగరపాలక సంస్థ తెలిపింది. వీరిలో 210 మంది పిల్లలు 9 ఏళ్ల లోపు వారు, 330 మంది 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారు. అయితే వీరిలో ఎవరూ కరోనాతో మరణించలేదని చాలా మందిలో కోవిడ్ లక్షణాలు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కర్ణాటక సీఎం బొమ్మై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 

కాగా, ఇండియాలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి.. నిన్న  40,120 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. క్రితం రోజుతో పోలిస్తే నిన్న నమోదైన కేసుల్లో 2.6 శాతం తగ్గుదల నమోదైందని ఐసీఎంఆర్ తెలిపింది.

Also Read:ఇండియాలో గత 24 గంటల్లో 40,120 కొత్త కేసులు: 3.13 కోట్ల మంది రికవరీ

దేశంలో మొత్తం కేసులు 3.21 కోట్లుగా నమోదైంది. కరోనా కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.నిన్న 19,70,495 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో 40,120 మందికి కరోనా సోకిందని ఐసీఎంఆర్ ప్రకటించింది. కరోనాతో దేశ వ్యాప్తంగా 4,30, 254 మంది  మరణించారు.

గత 24 గంటల్లో కరోనా నుండి  42 వేల మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనా నుండి  3.13 కోట్ల మంది కోలుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇండియాలో కరోనా రికవరీ రేటు 97.46 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో ప్రస్తుతం 3,84,227 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 57,31,574 మంది కరోనా టీకా వేయించుకొన్నారు. 

click me!