కత్తి దొంగిలించి ఆరుగురిపై దాడి: ఒకరి మృతి

Published : Oct 19, 2020, 09:14 PM IST
కత్తి దొంగిలించి ఆరుగురిపై దాడి: ఒకరి మృతి

సారాంశం

కత్తి దొంగతనం చేసిన ఓ ఉన్మాది కన్పించినవారిని పొడిచాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించారు.కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఈ ఘటన చోటు చేసుకొంది.

బెంగుళూరు: కత్తి దొంగతనం చేసిన ఓ ఉన్మాది కన్పించినవారిని పొడిచాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించారు.కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఈ ఘటన చోటు చేసుకొంది. బెంగుళూరు పట్టణంలోని కాటన్‌పేట్ ప్రాంతంలో మటన్ దుకాణాంలో కత్తిని దొంగించాడు గణేష్.

ఈ కత్తితో కన్పించినవారిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో  ఆరుగురు గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు.గణేష్ ఎక్కడ ఉన్నాడో  సమాచారాన్ని కనుగొన్న పోలీసులు  అతడిని అరెస్ట్ చేశారు. 

 అతడిపై హత్య, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు పెట్టారు. గాయపడిన వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.నిందితుడు కూలీగా పనిచేస్తున్నాడు. అయితే అతను ఎందుకు కత్తిని దొంగిలించిన కన్పించినవారిపై దాడికి పాల్పడ్డాడనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గణేష్ కు గతంలో ఏమైనా నేర చరిిత్ర ఉందా అనే  కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గణేష్ కు సంబంధించిన వారి నుండి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?