దారుణం.. ముగ్గురు చిన్నారులను చెట్టుకు కట్టేసి, బలవంతంగా బీడీలు తాగించి.. ఆరుగురు ముఠా ర్యాగింగ్..

By AN TeluguFirst Published Oct 26, 2021, 11:06 AM IST
Highlights

దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు social media లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో 11-13 సంవత్సరాల వయస్సు గల నిస్సహాయ చిన్నారులు, తాము తాగలేమని.. తమను వెళ్లనివ్వమని గుంపును వేడుకోవడం అందరికీ కదిలిస్తోంది.

బెంగళూరు:  బెంగళూరులో అమానుష ఘటన జరిగింది. ముగ్గురు ప్రైమరీ స్కూలు విద్యార్థులను ఆరుగురు సభ్యుల ముఠా  శనివారం మధ్యాహ్నం  చెట్టుకు కట్టేసి బలవంతంగా బీడీలు తాగించారు. ఈ ఘటన తూర్పు బెంగళూరులోని మహదేవ్‌పురాలో చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు social media లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో 11-13 సంవత్సరాల వయస్సు గల నిస్సహాయ చిన్నారులు, తాము తాగలేమని.. తమను వెళ్లనివ్వమని గుంపును వేడుకోవడం అందరికీ కదిలిస్తోంది.

కేఆర్ పురం సమీపంలోని దేవసంద్ర వార్డులోని బీ నారాయణపురలోని BBMP స్కూల్ క్యాంపస్‌లో 5వ తరగతి students చిత్రహింసలకు గురయ్యారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఈ ప్రాంతంలో నిఘా పెంచడంలో, అల్లరి మూకలను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

గతంలోనూ ఇలాంటి harrasments జరిగిన దాఖలాలు ఉన్నాయని.. పోలీసులు వారిని పట్టుకోలేకపోయారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మాజీ కార్పొరేటర్‌ చేసిన ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు ఈ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో వివేక్, 19, మహేష్, 18. మిగిలిన నలుగురికి 17 ఏళ్లు. వారిలో ఇద్దరు విద్యార్థులు అని తెలిసింది.

ప్రాథమిక విచారణలో నిందితులు స్కూల్ గ్రౌండ్‌కు ఆడుకోవడానికి  వచ్చిన పిల్లలను దగ్గరికి పిలిచి.. ర్యాగింగ్ చేశారని తెలిసింది. వారు చెప్పినట్లు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని తేలింది. 

"వారు పిల్లల్ని నేల మీద పడుకోమని చెప్పి.. మరొకరిని కర్రలతో కొట్టమని వారిని ఆదేశించారు. నిందితుల్లో ఒకడు తనను తాను షోలేలో గబ్బర్ సింగ్ అని చెప్పుకుంటూ.. చిన్న పిల్లలను బెదిరిస్తూ తిరుగుతున్నాడు. ఈ నిందితులు తమ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాఠశాల ఆవరణను అడ్డాగా మార్చుకున్నారు, ”అని వర్గాలు తెలిపాయి. 

శనివారం ఇంటికి వచ్చిన ఓ చిన్నారి భిన్నంగా ప్రవర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. “నా కొడుకు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. రాగానే బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. బాగా వణికిపోతున్నాడు. అతని ఒళ్లు కూడా వేడిగా ఉంది. కాళ్ళ నుండి రక్తం కారుతోంది, ”అని ఒక బాలుడి parents చెప్పారు.

"నా కొడుకును దగ్గరికి తీసుకుని బాగా ఓదార్చిన తర్వాత, ఏమి జరిగింది అని అడిగాం. అప్పటికి భయం నుంచి కాస్త తేరుకుని మాకు జరిగిన సంఘటనను వివరించాడు. ఆ ఘటన మమ్మల్ని బాగా భయపెట్టింది”అని పిల్లవాడి తండ్రి చెప్పాడు.

భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం..!

అయితే, ఈ ఘటన జరుగుతున్న సమయంలో స్కూల్ గ్రౌండ్ చుట్టు పక్కల ఉన్న స్థానికులు కొందరు దీన్ని వీడియో తీసి, ఆ క్లిప్‌లను దేవసంద్ర వార్డు మాజీ కార్పొరేటర్ ఎస్ శ్రీకాంత్‌కు పంపారు. 

ఆయన వెంటనే పోలీసులను అలర్ట్ చేశారు. దీనిమీద శ్రీకాంత్ మాట్లాడుతూ..“వీడియో చూసి నాకు భయం వేసింది. అవి భయానక చిత్రాలు. ఇది పూర్తిగా అమానవీయం. బాలల హక్కులను ఉల్లంఘించడమే..’ అని అన్నారు.

“ఈ పిల్లలు దుకాణం నుంచి beediలు కొనుక్కురావడానికి నిరాకరించడంతో, ముఠా వారిని చెప్పులు లేకుండా నేలపై కూర్చోబెట్టింది. కాళ్లు, మెడపై కర్రలతో కొట్టారు. చాలా మంది పిల్లలకు మెడ, చేతి, మణికట్టు, అరచేతిలో కాలిన గాయాలు ఉన్నాయి, ”అన్నారాయన. నిందితులపై జువైనల్ జస్టిస్ యాక్ట్, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివేక్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.

click me!