భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం..!

By telugu news teamFirst Published Oct 26, 2021, 10:41 AM IST
Highlights

వారు మంటలను అదుపు చేసేలోగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వారు ఆ మంటలను పొగతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. 


దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఓల్డ్ సీమాపురి ప్రాంతంలోని మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని నలుగురు సజీవదహనమయ్యారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.  తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో.. ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో.. వారి సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుంది. వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. వారు మంటలను అదుపు చేసేలోగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వారు ఆ మంటలను పొగతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. 

బాధితులు హోరీలాల్(58), అతని భార్య రీనా(55), వారి కుమారుడు అష్షు(24), వారి కుమార్తె రోహిణి(18) లు ప్రాణాలు కోల్పోయారు. వీరి మరో కుమారుడు  అక్షయ్(22) సెకండ్ ఫ్లోర్ లో నిద్రపోయాడు.  కాగా.. అతను మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. కుటుంబం మొత్తంలో అతను ఒక్కడే మిగలడం గమనార్హం.

హోరీలాల్ క్లాస్ 4 ఉద్యోగి. అతను వచ్చే ఏడాది 2022 మార్చిలో రిటైర్ అవ్వాల్సి ఉంది. ఆయన భార్య ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో స్వీపర్ గా పనిచేస్తోంది. వారి కుమారుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. కుమార్తె అప్షు.. 12వ తరగతి చదువుతోంది. అక్షయ్.. లేబర్ గా వర్క్ చేస్తున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు అధికారులు తెలిపారు,

మస్కిటో కాయిల్ నుంచి మంటలు చెలరేగినట్లు.. ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాని నుంచి వచ్చిన పొగతో వారికి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

హస్తినలోని ఇరుకు గల్లీలో జరిగిన అగ్నిప్రమాదంతో ప్రజలు భయాందోళన చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.

click me!