
హాస్యనటి శ్రద్ధా జైన్ గురించి తెలిసే ఉంటుంది. ఇటీవల చాలా ఐటీ కంపెనీలు ఉద్యోగులను విపరీతంగా తొలగించేశాయి. ఈ విషయంపై ఇటీవల ఆమె ఓ వీడియో చేయగా... అది వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఆమె మరింత ఫేమస్ గా మారింది. ఆ వీడియోతోనే ఆమె పాపులారిటీ బాగా పెరిగిపోయింది అంటే... తాజాగా ఆమె ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
తన వీడియోలో ఆమె ఎక్కువగా..‘అయ్యో’ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కాగా... మోదీ కూడా ఆమెను అయ్యో అంటూ పలకరించారట. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం విశేషం. మోదీతో దిగిన ఫోటోని ఆమె పంచుకున్నారు. మోదీని చూసిన క్షణం తాను రెప్ప కొట్టలేదని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మోదీకి దన్యావాదాలు తెలియజేశారు.
కాగా.. ఆమె మెదీని కలిసిన సమయంలో ఆమెతో పాటు కేజీఎఫ్ హీరో యష్, కాంతారా హీరో రిషభ్ శెట్టి, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వినీ పునీత్ రాజ్ కుమార్ కూడా కలిశారు. ఆ ఫోటోని కూడా ఆమె షేర్ చేశారు. మోదీని కలిసినందుకు ఆమెకు... నెటిజన్లు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. కాగా.. శ్రద్ధా జైన్ కి ఇన్ స్టాగ్రామ్ లో 6లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.