ఆటో డ్రైవర్‌కు రూ. 1.6 కోట్ల విల్లా

By narsimha lodeFirst Published May 2, 2019, 5:40 PM IST
Highlights

ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి ఆస్తులు చూసిన ఐటీ శాఖ అధికారులు షాక్ అయ్యారు.  బెంగుళూరు శివారులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఆయనకు రూ. 1.6 కోట్ల ఖరీదైన ట్రిప్లెక్స్ విల్లా ఉన్నట్టుగా గుర్తించారు.
 

బెంగుళూరు: ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి ఆస్తులు చూసిన ఐటీ శాఖ అధికారులు షాక్ అయ్యారు.  బెంగుళూరు శివారులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఆయనకు రూ. 1.6 కోట్ల ఖరీదైన ట్రిప్లెక్స్ విల్లా ఉన్నట్టుగా గుర్తించారు.

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు‌కు చెందిన నల్లూరల్లి సుబ్రమణి  అనే 37 ఏళ్ల వ్యక్తి వద్ద రూ. 7.9 కోట్ల నగదు, కోట్ల రూపాయాల బంగారు ఆభరణాలు, ఆస్తుల పత్రాలు పట్టుబడ్డాయని సమాచారం. అయితే ఈ వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.

ఈ విల్లా కొనుగోలు చేసేందుకు సుబ్రమణి ఎలా డబ్బులను చెల్లించారనే విషయమై చెప్పాలని  15 విల్లాల గేటేడ్ కమ్యూనిటీ  యజమానికి  నోటీసులు జారీ చేశారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఐటీ అధికారులకు చేరవేశామని  జెట్టి ఇంజనీరింగ్ ఇండియా ప్రతినిధులు ప్రకటించారు. 

 2015లో  సుబ్రమణి  విల్లాను కొనుగోలు చేసినట్టుగా జెట్టి ప్రతినిధులు తెలిపారు..  అతడు మమ్మల్ని సంప్రదించాడు. రూ. 1.6 కోట్లకు గానూ రూ.10 లక్షలు విలువచేసే 16 చెక్కులు ఇచ్చాడని అని జెట్టీ కంపెనీ ప్రకటించింది.

కొంత కాలంగా సుబ్రమణి ఆటో నడపడం లేని విషయాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. సుబ్రమణికి ఇంత  ఆదాయం  ఎలా వచ్చిందనే దానిపై ఐటీ శాఖాధికారులు ఆరా తీస్తున్నారు.
 

click me!