బెంగాల్ ఎవరికీ తలవంచదు.. మానవత్వం, ఐక్యత, సమగ్రత కోసం పోరాడుతుంది : సీఎం మమతా బెనర్జీ

By Mahesh RajamoniFirst Published Dec 15, 2022, 11:27 PM IST
Highlights

Kolkata: మానవత్వం, ఐక్యత, సమగ్రత కోసం మన రాష్ట్రం ఎప్పుడూ పోరాడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్ ఎవరికీ తలవంచదు లేదా ఎవరినీ వేడుకోదని ఆమె పేర్కొన్నారు. 
 

West Bengal Chief Minister Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఎల్లప్పుడూ మానవత్వం, ఐక్యత, సమగ్రత కోసం పోరాడుతుందని, ఈ సమస్యలపై ఎవరికీ తలవంచదని రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. గురువారం నేతాజీ ఇండోర్ స్టేడియంలో 28వ కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (కేఐఎఫ్‌ఎఫ్) ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బెంగాల్‌కు సుదీర్ఘ పోరాట చరిత్ర ఉందన్నారు. “బెంగాల్ ఏకత్వం, మానవత్వం, భిన్నత్వం, సమగ్రత కోసం పోరాడుతోంది. ఈ పోరాటం కొనసాగుతుంది” అని ఆమె అన్నారు. అలాగే,  “మా రాష్ట్రం ఎవరికీ తలవంచదు, ఎవ‌రినీ అడుక్కోదు” అని స్ప‌ష్టం చేశారు. తన ప్రసంగంలో, ముఖ్యమంత్రి మ‌మ‌తా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ భారతీయ, ప్రపంచ సినిమాలకు చేసిన అపారమైన కృషికి భారతరత్నతో సత్కరించాలని డిమాండ్ చేశారు.

అమితాబ్ బచ్చన్ కు భారతరత్న ఇవ్వాలి..

పశ్చిమ బెంగాల్‌లోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన 28వ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (KIFF) ప్రారంభ సెషన్‌లో మ‌మ‌తా బెనర్జీ తన ప్రసంగంలో, భారతీయ, అంత‌ర్జాతీయ సినిమాలకు చేసిన కృషికి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ను భారతరత్నతో సత్కరించాలని అన్నారు. అమితాబ్ బచ్చన్‌ను భారతీయ సినిమాకు ఇంత కాలం చేసిన కృషికి భారతరత్న అవార్డుతో సత్కరించాలనే డిమాండ్‌ను అధికారికంగా కాకుండా బెంగాల్ తరపున లేవనెత్తుతామని చెప్పారు. "అధికారికంగా కాకపోయినప్పటికీ, బెంగాల్ నుండి, అమితాబ్ బచ్చన్ భారతీయ సినిమాకు ఇంత కాలం చేసిన కృషికి భారతరత్న అవార్డుతో సత్కరించాలని మేము ఈ డిమాండ్‌ను లేవనెత్తాము. ఒక మనిషిగా, అతను కూడా గొప్పవాడు" అని మమతా బెనర్జీ అన్నారు.

సినిమాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి అమితాబ్ బచ్చన్ లేవనెత్తడాన్ని బెనర్జీ ప్రస్తావిస్తూ, “అమితాబ్ బచ్చన్ వచ్చి మనలో ఎవరూ చెప్పలేని విషయాన్ని విపులంగా చెప్పారు. ఇప్పుడు కూడా, వేదికపై ఉన్న నా సహోద్యోగులు పౌర హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తడాన్ని అంగీకరిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని అన్నారు. నటులు జయా బచ్చన్, షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, క్రికెటర్ సౌరవ్ గంగూలీ, చిత్రనిర్మాత మహేష్ భట్, గాయకులు కుమార్ సాను, అరిజిత్ సింగ్, నటుడిగా మారిన రాజకీయవేత్త శత్రుఘ్న సిన్హా కూడా ప్రారంభోత్సవంలో ఉన్నారు.

బకాయి డబ్బులు లేవని, కేంద్ర ప్రభుత్వం అడుక్కుంటోంది.. 

జీఎస్టీతో పాటు ఎంఎన్ఆర్ఈజీఏ బకాయిలు చెల్లించేందుకు నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని పదేపదే కోరామని మమత  బెన‌ర్జీ చెప్పారు. కానీ అది విడుదల కాలేదు. ఇదే స‌మ‌యంలో కేంద్ర ప్రభుత్వం త‌మ నుంచి జీఎస్టీ తీసుకుంటోంది, కానీ త‌మ‌కు 100 రోజుల ఉపాధి డబ్బులు ఇవ్వడం లేదు అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. 

లక్ష కోట్ల బకాయిలున్నాయంటూ.. 

మూడు నెలల తర్వాత ఆర్థిక సంవత్సరం ముగుస్తుందనీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇప్పుడు మనం ఈ సమయంలో ఏమి చేయగలం. మేం డబ్బులు పంపాం కానీ మీరు డబ్బులు వినియోగించుకోలేకపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఈ డబ్బు ఖర్చు చేయకపోతే వెనక్కి వెళ్లిపోతుంది. ఇదంతా  కుట్రపూరిత తెలివి అంటూ విమ‌ర్శించారు. బెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల బకాయి ఉందని మమత ఆరోపించారు. పలుమార్లు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశామ‌ని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజన పథకాలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని మమత ఆరోపిస్తున్నారు.

click me!