పెంపుడు కుక్కపై రెండేళ్లుగా అత్యాచారం.. బెంగాల్ వ్యక్తి అరెస్ట్

Published : Mar 31, 2023, 04:51 PM IST
పెంపుడు కుక్కపై రెండేళ్లుగా అత్యాచారం..  బెంగాల్ వ్యక్తి అరెస్ట్

సారాంశం

South 24 Parganas: పశ్చిమ బెంగాల్‌లోని తన నివాసంలో రెండేళ్లపాటు తన పెంపుడు కుక్కపై అత్యాచారం చేసినందుకు 60 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు  కుక్కపై లైంగికదాడి చేస్తుండగా  స్థానికులు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.  

Bengal man arrested for raping pet dog: పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో 60 ఏళ్ల వృద్ధుడు తన పెంపుడు కుక్కపై రెండేళ్లుగా పదేపదే అత్యాచారానికి పాల్పడిన దారుణ‌ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు రతికాంత్ సర్దార్ ఈ దారుణానికి ఒడిగట్టిన దృశ్యాలను ఇరుగుపొరుగు వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అతడిని అరెస్టు చేశారు. ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ గా మారడంతో ఆ వ్యక్తి అసభ్యకర చర్యను గమనించిన అధికారులు గురువారం సాయంత్రం అతడిని అరెస్టు చేశారు. ఇండియా టుడే కథనం ప్రకారం..  నిందితుడు  కుక్కపై లైంగికదాడి చేస్తుండగా  స్థానికులు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నగ్నంగా, మద్యం మత్తులో ఉన్న నిందితుడు తన కుక్కతో శృంగారంలో పాల్గొంటుండగా పెంపుడు కుక్క అర‌వ‌డంతో ఇరుగుపొరుగు వారు గుర్తించారు. 

దక్షిణ 24 పరగణాల్లోని సోనార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌహతి పాయరబగన్ ప్రాంతంలోని తన ఇంట్లో సర్దార్ తన పెంపుడు కుక్కపై దాదాపు రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని స్థానికులు తెలిపారు. ఇలాంటి అసహజ చర్యకు పాల్పడవద్దని, కుక్కను విడిచిపెట్టాలని తాము పదేపదే కోరామని, కానీ అతను నిరాకరించాడ‌ని తెలిపారు. అందుకే, ఈ దారుణ‌మైన విష‌యాన్ని చిత్రీకరించి ఆన్ లైన్ లో షేర్ చేయడం తప్ప తమకు వేరే మార్గం క‌నిపించ‌లేదని ఇరుగుపొరుగు వారు తెలిపారు.

కాగా, యానిమల్ వెల్ఫేర్ గ్రూప్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై సెక్షన్ 377 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ప్రాథమిక దర్యాప్తు తర్వాత అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం కుక్కను రక్షించి పశువైద్యశాలకు పంపగా లైంగిక వేధింపులను వైద్యులు ధ్రువీకరించారు. బాధిత కుక్క‌ను ప్రస్తుతం సోనార్పూర్ లోని జంతు చికిత్సా కేంద్రంలో పరిశీలనలో ఉంచారు.
 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు