యూపీలోని కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. న‌లుగురు మృతి

Published : Mar 31, 2023, 04:23 PM ISTUpdated : Mar 31, 2023, 04:24 PM IST
యూపీలోని కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. న‌లుగురు మృతి

సారాంశం

Lucknow: నగర్ కొత్వాలి ప్రాంతంలోని ధికోలి రోడ్డులోని దక్షా మ్యారేజ్ హోమ్ సమీపంలో నడుస్తున్న కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి నలుగురు మరణించారు. పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుంది. పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల వరకు వినిపించేంత బలమైన పేలుడు సంభ‌వించింది.  

Bulandshahar chemical factory Blast: ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఇంట్లో నిర్వహిస్తున్న ఒక  కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కు నలుగురు మృతి చెందారు. పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల వరకు వినిపించేంత బలంగా ఉంది. సిలిండర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఘటనా స్థలం నుంచి సిలిండర్ల ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన ఇల్లు కూలిపోయిందనీ, శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవ‌కాశాలున్నాయి. దీంతో మృతుల సంఖ్య మ‌రింత పెర‌గ‌వ‌చ్చు. 

ప్ర‌స్తుతం అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఇప్పటివ‌ర‌కు న‌లుగురి మృత దేహాలను వెలికితీశారు. నగర్ కొత్వాలి ప్రాంతంలోని ధికోలి రోడ్డులోని దక్ష్ మ్యారేజ్ హోమ్ సమీపంలో నడుస్తున్న కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుంది. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మృతుల‌ను అభిషేక్ (20), రయీస్ (40), ఆహద్ (05), వినోద్‌గా గుర్తించారు. పేలుడు జరిగిన ఇంటిని వీరు అద్దెకు తీసుకున్నార‌ని స‌మాచారం. 

 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు