
దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పనిలో నుంచి తొలిగించారనే కారణంతో దంపతులతో పాటు వారి ఇంటి పనిమనిషి దారుణంగా హత్య చేశారు. ఆ ఘటన పశ్చిమ ఢిల్లీలోని హరినగర్‌లో వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఓ ఇంట్లో భార్యభర్తలు, ఇంటి పనిమనిషి హత్యకు గురయ్యారు. మృతులను భర్త సమీర్ అహుజా, భార్య షాలు, ఇంటి పనిమనిషి స్వప్నగా గుర్తించారు. దోపిడీ తర్వాత ముగ్గురు వ్యక్తులు హత్యకు గురైనట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు షా
బ్యూటీ పార్లర్ నడుపుతుంది. అయితే.. కొన్ని రోజుల క్రితం తన దగ్గర పని చేస్తున్న ఇద్దరు మహిళలను పలు కారణాలతో ఉద్యోగం నుండి తొలగించినట్లు పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో హత్యకు గురైన దంపతులతో వారిని వాగ్వాదం జరిగినట్టు గురించారు. ఘటనను అవమానంగా భావించిన వారు.. బ్యూటీ పార్లర్ నిర్వహకురాలును చంపి, ప్రతీకారం తీర్చుకున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడు తన స్నేహితుల సహాయంతో హత్య చేశాడు.
పట్టపగలే ఇంట్లోకి చొరబడ్డ దుండగులు
మంగళవారం ఉదయం ఎప్పటిలాగే పశ్చిమ జిల్లా హరినగర్‌లోని ఇంటి వద్ద పని చేసేందుకు ఇంటి పనిమనిషి 7.30 గంటలకు వచ్చింది. ఇంట్లో భార్యాభర్తలు, రెండేళ్ల చిన్నారి నివాసం ఉంటున్నారు. ఇంటి పనిమనిషి వచ్చిన తర్వాత బైక్‌పై వచ్చిన ఐదుగురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. దారుణంగా హత్య చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో షాలు, ఇంటి పనిమనిషి సప్న మృతదేహాలు లభ్యం కాగా, సమీర్ శవం భవనం మొదటి అంతస్తులో కనిపించింది. అతని ముఖం,తలపై బలమైన గాయలను పోలీసులు గుర్తించారు. ఈ మరణాహోమం జరుగుతున్న సమయంలో ఆ దంపతుల రెండేళ్ల కుమార్తె మొదటి అంతస్తులో దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్నట్లు గుర్తించారు. దుండగులు ఆ చిన్నారిని గుర్తించలేక పోయినందున ఆ చిన్నారిని చంపలేదని పోలీసులు తెలిపారు.
హత్యకు గురైన ఇద్దరు మహిళల గొంతులు మొద్దుబారిన ఆయుధంతో కోశారని, సమీర్ తల పగలగొట్టబడిందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఉదయం 8 గంటల ప్రాంతంలో రెండు మోటర్‌బైక్‌లపై ఇంటికి వచ్చినట్లు గుర్తించారు.
ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో పనిమనిషి ఉండడంతో వారు ఆమెను కూడా హత్య చేశారని అధికారులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన సమీర్ , సుజిత్‌లను అరెస్టు చేశారు. కానీ, హత్యలకు ప్రధాన కుట్రదారు, అతని స్నేహితురాలు, మరో నిందితుడు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం అన్వేషణ కొనసాగుతోందని తెలిపారు.