మరోసారి కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం.. 8,000 బాతులు, కోళ్లలను చంపేలని ఆదేశం..

By Rajesh KarampooriFirst Published Dec 15, 2022, 6:20 PM IST
Highlights

కేరళ మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం చేలారేగింది. కొట్టాయంలోని అర్పూకర, తలయాజమ్ పంచాయతీలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది. దీంతో ప్రభావిత ప్రాంతాలకు ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న 8వేల బాతులు, కోళ్లు ,ఇతర పెంపుడు పక్షులను చంపాలని అధికారులు ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థలు, జంతుసంక్షేమ శాఖలను ఆదేశించారు.

కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం చేలారేగింది. కొట్టాయం జిల్లాలోని అర్పూకర, తలయాజం అనే రెండు పంచాయతీలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది. దీంతో  ప్రభావిత ప్రాంతాలకు ఒక కిమీ పరిధిలో ఉన్న దాదాపు 8,000 బాతులు, కోళ్లు , ఇతర పెంపుడు పక్షులను చంపాలని అధికారులను ఆదేశించింది. జిల్లా కలెక్టర్ పీకే జయశ్రీ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించి .. ప్రభావిత ప్రాంతాలలో క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థలు, పశుసంక్షేమ శాఖను ఆదేశించారు.

అలాగే.. ఈ ప్రాంతాలను బర్డ్ ఫ్లూ కేంద్రంగా ప్రకటించి.. ఈ ప్రాంతానికి  10 కి.మీ పరిధిలో మూడు రోజుల పాటు కోడి, బాతు, పిట్ట, ఇతర కోడి గుడ్లు , మాంసం అమ్మకాలు మరియు దిగుమతిపై నిషేధం విధిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వ్యాధి కేంద్రానికి 10 కిలోమీటర్ల పరిధిలోని 19 స్థానిక సంస్థల పరిధిలో కోడి, బాతు, ఇతర పెంపుడు పక్షులు అసాధారణ మరణాలు సంభవిస్తే వాటిని సమీపంలోని పశువైద్యశాలకు తెలియజేయాలని కలెక్టర్‌ సూచించారు. 

అర్పూకరలోని డక్ ఫామ్‌లో , తలయాజమ్‌లోని బ్రాయిలర్ కోళ్ల ఫారమ్‌లో పక్షులు చనిపోవడంతో.. వాటి  నమూనాలను పరీక్షల కోసం భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్‌కు పంపారు. కేరళ జంతు సంరక్షణ శాఖ, స్థానిక సంస్థలు, రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖ, ఆరోగ్య శాఖ, అగ్నిమాపక, రక్షక శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. H5N1 వైరస్ వ్యాప్తి వల్ల అన్ని పక్షులపై ప్రభావితం చూపుతోందని  నివేదించబడినది. ఇది వలస పక్షులు, సముద్ర పక్షుల ద్వారా వ్యాపిస్తుంది.

బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి? 

ఇది ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (H5N1) వైరస్. ఇది పక్షులకు ఈ వైరల్ సంక్రమించడం వల్ల బర్డ్ ప్లూ వ్యాపిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే.. ఈ వ్యాధి ఇన్ఫ్లుఎంజా రకం A వైరస్ వల్ల కలిగే అంటు వైరల్ వ్యాధి. అత్యంత ప్రసిద్ధ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (H5N1) బర్డ్ ఫ్లూ కారణంగా, పక్షులతో పాటు మనుషులు కూడా చనిపోతారు.

బర్డ్ ఫ్లూ మనుషులకు ఎలా వ్యాపిస్తుంది?

>> వ్యాధి సోకిన కోళ్లు లేదా ఇతర పక్షులతో ప్రజలు సన్నిహితంగా ఉన్నప్పుడు ఈ వైరస్ సోకవచ్చు.

>> బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల మాంసాన్ని (పచ్చి మాంసం) ప్రజలు తిన్నప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి చెందవచ్చు.

>> కోడి లేదా పక్షి బతికి ఉన్నా లేదా చనిపోయినా..ఈ వైరస్ కళ్ళు, ముక్కు లేదా నోటి ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది.

>> ఈ వైరస్ సోకిన పక్షిని శుభ్రపరిచినప్పుడు కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందవచ్చు. 

>> వ్యాధి సోకిన పక్షి మనుషులను రక్కడం లేదా గోకడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.

>> బర్డ్ ఫ్లూకి సకాలంలో చికిత్స చేయకపోతే..దాని ప్రతికూల ప్రభావం అనేక అవయవాలను ప్రభావితం చేస్తుంది.

బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు

>> జ్వరం రావడం.తలనొప్పి

>> కండరాలు నొప్పిగా అనిపించడం.

>> నిరంతరం ముక్కు కారడం.

>> దగ్గు సమస్య .

>> పొత్తి కడుపులో నొప్పి. 

>> కంటి ఎరుపు (కండ్లకలక) 

>> అతిసారం

>> వికారం లేదా వాంతులు. 

>> గొంతులో వాపు సమస్య.

బర్డ్ ఫ్లూ నివారించడం ఎలా  

>> మీరు బర్డ్ ఫ్లూ ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే, మీ ఆహారంలో నాన్ వెజ్ చేర్చకండి. 

>> నాన్ వెజ్ కొనే సమయంలో అక్కడి  శుభ్రతపై శ్రద్ధ పెట్టండి. 

>> మాస్క్ ధరించి బయటకు వెళ్లండి.

బర్డ్ ఫ్లూ  వైద్య చికిత్స

>> యాంటీవైరల్ ఔషధాల ద్వారా ఈ సమస్య పెరగకుండా నిరోధించబడుతుంది.

>> ఈ సమస్య సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

>> ఎక్కువ ద్రవాలను తీసుకోవాలి.

click me!