న్యాయ వృత్తి అన్ని వృత్తుల మాదిరి కాదు.. నా మూలాలు బార్ కౌన్సిల్ నుంచే మొదలు: జస్టిస్ ఎన్వీ రమణ

By Siva KodatiFirst Published Sep 4, 2021, 2:24 PM IST
Highlights

సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సత్కరించింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ. కోర్టుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు. ఖర్చులు, కేసుల విచారణలో జాప్యం న్యాయ వ్యవస్థకు అతిపెద్ద సవాల్ అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

న్యాయ వృత్తి అన్ని వృత్తుల మాదిరి కాదన్నారు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. శనివారం ఆయనను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సత్కరించింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ. కోర్టుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు. ఖర్చులు, కేసుల విచారణలో జాప్యం న్యాయ వ్యవస్థకు అతిపెద్ద సవాల్ అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సవాళ్లను అధిగమించేందుకు తన వంతు కృషి చేస్తానని జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. మా మూలాలు బార్ కౌన్సిల్ నుంచే మొదలయ్యాయని ఆయన గుర్తుచేశారు. బార్ కౌన్సిల్‌తో తనకు ఎనలేని అనుబంధం వుందని సీజేఐ తెలిపారు. న్యాయవాదులు నైతిక విలువలతో పనిచేయాలని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. 

click me!