జడ వేసుకోవాల్సిందే, సెల్ఫీలపై నిషేధం, డ్రెస్‌కోడ్: బీహార్ సుందరావతి కాలేజీ వివాదాస్పద నిర్ణయం

By narsimha lodeFirst Published Aug 23, 2021, 4:51 PM IST
Highlights

కొత్త డ్రెస్ కోడ్, సెల్ఫీలు దిగడంపై నిషేధం, జడ వేసుకోకుండా కాలేజీకి రావొద్దని  బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పుర్ సుందారవతి మహిళా యూనివర్శిటీ కాలేజీ నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయం వివాదాస్పదమైంది.ఈ నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయమై వీసీకి కూడ విద్యార్ధి సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు.

పాట్నా: బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పుర్‌  మహిళా విశ్వవిద్యాలయం పరిధిలోని సుందరావతి మహిళా కాలేజీ యాజమాన్యం తీసుకొన్న నిర్ణయం వివాదాస్పదమైంది. కాలేజీకి వచ్చే యువతులంతా జడలు వేసుకొని రావాలని ఆదేశించింది.

అమ్మాయిలు కాలేజీకి  జడ వేసుకోకకుండా లూజ్ హెయిర్ తో కాలేజీకి వస్తే  కాలేజీలోకి అనుమంతించబోమని తేల్చి చెప్పింది.కాలేజీ ఆవరణలో విద్యార్ధినిలు సెల్ఫీలు కూడా తీసుకోవద్దని కోరింది. 

ఫస్టియర్ విద్యార్ధినులకు డ్రెస్ కోడ్ ను నిర్ణయించనున్నారు. ఈ మేరకు ఓ కమిటీని నియమించారు.ఈ కమిటీ సభ్యులు సూచించిన విధంగానే డ్రెస్ వేసుకొని కాలేజీకి రావాలని  ప్రిన్సిపాల్  ప్రొఫెసర్ రామన్ సిన్హా కోరారు.

కమిటీ సూచించిన డ్రెస్  వేసుకోని విద్యార్థినిలకు కాలేజీలో ప్రవేశాన్ని నిషేధించారు. ఈ కాలేజీ తీసుకొన్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. విద్యార్ధి సంఘాలు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. డ్రెస్ కోడ్, జడ లేకుండా కాలేజీలోకి అనుమతించబోమని నిబంధనలు పెట్టడంపై విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నిర్ణయాన్ని తాలిబన్ల నిర్ణయంగా విద్యార్ధి సంఘాలు అభివర్ణించాయి.  కాలేజీ విధించిన కొత్త నిబంధనలపై  కొన్ని విద్యార్ధి సంఘాల నేతలు  యూనివర్శిటీ వీసీకి ఫిర్యాదు చేశారు. 

సుందరావతి మహిళా కాలేజీలో ప్రస్తుతం 1500 మంది విద్యార్థులు చదువుతున్నారు.  ఈ ఏడాది కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులు రాయల్ బ్లూ కుర్తీ,తెల్లటి దుప్పటాను ధరించాలి. తెల్ల సాక్సులు, బ్లాక్ షూలను వేసుకోవాలి. 


 

click me!