నికితా తోమర్ హత్య : తౌఫీక్ ని ఎన్ కౌంటర్ చేయాలి.. కంగనా రనౌత్...

By AN TeluguFirst Published Oct 28, 2020, 11:46 AM IST
Highlights

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నికితా తోమర్ హత్య కేసుపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడింది. ఈ జిహాదీలకు సిగ్గు, భయం లాంటివి లేవు.. ఇప్పటికే ఫ్రాన్స్ లో జరిగిన దానికి ప్రపంచమంతా దిగ్భ్రాంతికి గురైంది. ఇప్పుడు బల్లాగఢ్ లో మతంలోకి మారడానికి నిరాకరించిందని హిందూ అమ్మాయిని కాల్చి చంపారు. వీరిమీద వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది. అంతేకాదు weWantEncounterOfTaufeeq అనే హాష్ ట్యాగ్ ను జత చేసింది.

సోమవారం మధ్యాహ్నం ఫరిదాబాద్‌లో బల్లాగఢ్‌లో 21 ఏళ్ల నికితా తోమర్‌ని తౌఫీఖ్ అనే వ్యక్తి రోడ్డుపై అతి దారుణంగా కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  నికిత మరో వ్యక్తితో వివాహానికి సిద్ధపడటంతోనే ఆమెను హత్య చేశానని నిందితుడు వెల్లడించాడు. నికిత (21) పరీక్ష రాసి వస్తుండగా, మాటు వేసిన ఇద్దరు దుర్మార్గులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి  అక్కడినుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఇక పోలీసుల దర్యాప్తులో ఈ నెల 24, 25 తేదీలలో నికిత, తౌసీఫ్‌లు దాదాపు 16 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మృతురాలి కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. 'లవ్ జిహాదీ' వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపించారు. ముస్లిం వర్గానికి చెందిన తౌసిఫ్... మతం మార్చుకుని అతన్ని వివాహం చేసుకోవాల్సిందిగా మూడేళ్ల నుంచి నికితను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. అందుకు ఆమె నిరాకరిస్తుండటంతో చివరికిలా హత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

తౌసిఫ్ వేధింపులపై 2018లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నికిత తండ్రి తెలిపారు. తౌసిఫ్ తమ కుమార్తెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. అయితే కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా తమ కుటుంబంపై తీవ్ర ఒత్తిడి రావడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. కుటుంబ సభ్యులు చేసిన 'లవ్ జిహాద్' ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి.

ఈ క్రమంలో కంగనా రనౌత్ ట్వీట్ కేసులో మరింత సీరియస్ నెస్ ను పెంచింది. 

click me!