బాబాకా దాబా యజమాని ఆత్మహత్యాయత్నం: సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స

By narsimha lodeFirst Published Jun 18, 2021, 3:26 PM IST
Highlights

బాబాకా దాబా యజమాని కాంత ప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడు.దీంతో ఆయనను  ఆసుపత్రిలో చేర్పించారు. ఆత్మహాత్యాయత్నం చేసిన కాంత ప్రసాద్ ను గుర్తించిన కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. 

న్యూఢిల్లీ: బాబాకా దాబా యజమాని కాంత ప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడు.దీంతో ఆయనను  ఆసుపత్రిలో చేర్పించారు. ఆత్మహాత్యాయత్నం చేసిన కాంత ప్రసాద్ ను గుర్తించిన కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో కాంత ప్రసాద్ రెస్టారెంట్ ను ప్రారంభించాడు. ఈ రెస్టారెంట్ నష్టాల్లో ఉంది. దీంతో ఆయన తిరిగి గతంలో తాన నడిపిన రోడ్డు సైడ్ పాత హోటల్ ను నడుపుకొంటున్నాడు. 

కరోనా కారణంగా ఆదాయం లేక ఇబ్బందిపడుతున్న విషయాన్ని బాబాకా దాబా నడుపుతున్న కాంతప్రసాద్ దంపతుల వ్యధను  ఓ యూట్యూబర్  వెలుగులోకి తెచ్చాడు.  ఈ విషయమై పలువురు  కాంత ప్రసాద్ దంపతులకు సహాయం చేశారు.  దీంతో రూ. 5 లక్షలతో అద్దె స్థలంలో రెస్టారెంట్ ప్రారంభించారు.

ఆరు మాసాల పాటు రెస్టారెంట్ నడిపినా అది సక్రమంగా నడవలేదు. దీంతో కాంత ప్రసాద్ తిరిగి పాత హోటల్ నడుతుపుకొంటున్నాడు. ఈ విషయమై మనోవేదనకు గురైన కాంత ప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబసభ్యులు చెప్పారు. సఫ్డర్‌జంగ్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.  కాంత ప్రసాద్ తనయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


 

click me!