లైవ్ లో అశ్లీల సంభాషణలు, అసభ్యప్రవర్తన.. యూట్యూబర్ జంట అరెస్ట్...

By AN Telugu  |  First Published Jun 18, 2021, 2:54 PM IST

నిషేధిత పబ్జీని లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు, మహిళల మీద అసభ్యకరమైన అశ్లీల సంభాషణలు చేసినందుకు ఓ యూట్యూబర్ జంటను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబర్ మదన్ కుమార్ మీద కేసు బుక్ కాగా అతను పరారీలో ఉన్నాడు. ఈ రోజు చెన్నైకి ఆరు గంటల దూరంలో ఉన్న ధర్మపురిలో మదన్ ను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కాగా యూట్యూబ్ ఛానల్ నిర్వాహకురాలైన అతని భార్య కృతికను ఇంతకు ముందే చెన్నైలో అరెస్టు చేశారు.

కృత్తిక, మదన్ నడుపుతున్న యూట్యూబ్ ఛానల్ కు సుమారు ఎనిమిది లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. వీరిలో  చాలామంది మైనర్లు. వీరు నడుపుతున్న మదన్, టాక్సిక్ మదన్ 18+, పబ్జీ మదన్ గర్ల్ ఫ్యాన్, రిచీ గేమింగ్ వైటి - యూట్యూబ్ ఛానెళ్లపై చెన్నైకి చెందిన ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి. 

Latest Videos

ఫిర్యాదులో ఆ వ్యక్తి  ఛానెల్‌లో "మదన్ తన ప్రియురాలిపై కోపంగా ఉన్నాడు,  18+ వారికి మాత్రమే, తమిళం, PUBGM,రిచీ గేమింగ్" తో సహా కొన్ని స్పెషల్ హెడ్డింగ్స్ ను ఉదహరించాడు. సదరు వీడియోల్లో మహిళలను అసభ్యంగా చిత్రీకరించినట్లు ఆరోపించాడు.

ఈ యూట్యూబ్ చానల్స్ ను ఫాలో అవుతున్న చాలామంది మైనర్లేనని పేర్కొంటూ, ఫిర్యాదుదారుడు మదన్ కుమార్‌పై చర్యలతో పాటు ఛానెల్‌ను నిషేధించాలని  కోరారు. దీంతో మదన్ కుమార్ మీద సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది.

దీంతో మదన్ గురువారం నాడు, ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించారు. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు "ఈ రికార్డ్ సంభాషణలు విని షాక్ అయ్యాం" అని తెలిపింది. అయితే, ఈ కేసు చట్టపరమైన పరిశీలనలో ఉంటుందా అనేది స్పష్టంగా చెప్పలేం అన్నారు.

"అతని సబ్ స్క్రైబర్లలో  ఫిర్యాదు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారనుకోవడం లేదన్నారు. సోషల్ మీడియాలో ఇలా అసభ్యంగా మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని.. PUBG లేదా అలాంటి గేమ్స్ విషయంలో ఉల్లంఘన వివరాలను  పరిశీలిస్తున్నాం" అని ఒక పోలీసు అధికారి చెప్పారు.

మదన్ కుమార్ యూట్యూబ్ ద్వారా చాలా సంపాదించాడని, "అతను నెలకు 3 లక్షలు సంపాదించినట్లు తెలుస్తుంది. అతని వద్ద 3 లగ్జరీ కార్లు ఉన్నాయి, వాటిలో రెండు ఆడి కార్లు" అని పోలీస్ అధికారి తెలిపారు.

click me!