Azam Khan: నన్ను ఎన్‌కౌంటర్ చేస్తారేమో..? : ఎస్పీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

By Rajesh Karampoori  |  First Published Oct 23, 2023, 2:58 AM IST

Azam Khan: ఎస్పీ మాజీ మంత్రి ఆజం ఖాన్ తనని ఎన్‌కౌంటర్ చేస్తారేమో..? అని భయాన్ని వ్యక్తం చేశారు. సీతాపూర్ జైలుకు తరలించిన సమయంలో.. అజం ఖాన్ తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశాడు.  


Azam Khan: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంను రాంపూర్ జైలు నుంచి ఆదివారం వేర్వేరు జైళ్లకు తరలించారు.జైలు నుంచి బయటకు వచ్చిన క్రమంలో ఆజం ఖాన్ మీడియాతో మాట్లాడుతూ... తనకు, తన కుమారుడికి ఏదైనా జరగవచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తనని హత్య చేయవచ్చని భయాన్ని వ్యక్తం చేశారు.

కుటుంబంతో సహా జైలులో ఉన్న ఆజం ఖాన్‌ను ఎన్‌కౌంటర్ చేయవచ్చని పేర్కొన్నారు. కొడుకు అబ్దుల్లా ఆజం ఖాన్ డబుల్ బర్త్ సర్టిఫికేట్ కేసులో ఆజం ఖాన్, భార్య టాంజిన్ ఫాతిమా, కొడుకులకు కూడా 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత ముగ్గురిని వేర్వేరు జైళ్లకు తరలించారు. శనివారం రాంపూర్ జైలు నుంచి బయటకు వచ్చిన అజంఖాన్ తనకు ఏమైనా జరగొచ్చని భయాన్ని వ్యక్తం చేశాడు.

Latest Videos

ఆజం ఖాన్‌ను సీతాపూర్ జైలుకు తరలించారు. అతని కుమారుడు అబ్దుల్లాను హర్దోయ్ జైలుకు పంపారు. రాంపూర్ జైలు నుంచి సీతాపూర్ వెళ్లేందుకు శనివారం బయటకు వచ్చిన ఆజంఖాన్ మాట్లాడుతూ.. మేము కూడా ఎన్‌కౌంటర్‌కు గురవుతాం. ఆజం ఖాన్‌ను పోలీసు కారులో తీసుకెళ్లారు. కారులో కూర్చోమని అడిగితే మధ్యలో సీట్లో కూర్చోనని, పక్క సీట్లో మాత్రమే కూర్చుంటానని చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా తనను మధ్యలో కూర్చోబెడుతున్నారని ఈ పోలీసులు చెప్పారు.

దీనిపై ఆజం ఖాన్ మాట్లాడుతూ మాకు వయసు వచ్చిందని మీరు అర్థం చేసుకోవాలి. మన వయస్సును మాత్రమే పరిగణించండి. వెన్నునొప్పి కారణంగా మధ్యలో కూర్చోవడానికి నిరాకరించాడు. మీడియా కథనాల ప్రకారం.. అజం ఖాన్ తన చేతులు, కాళ్ళు విరగొట్టి తనను తీసుకెళ్లమని పోలీసులను కూడా చెప్పాడు. ఉదయం 9.24 గంటలకు మాజీ మంత్రి సీతాపూర్ జైలుకు చేరుకున్నారు. ఆజం ఖాన్ 2022 మే 20న సీతాపూర్ జైలు నుంచి విడుదలయ్యాడు. దాదాపు 16 నెలల తర్వాత మళ్లీ అక్కడికి చేరుకున్నాడు.

click me!