సమాజ్‭వాదీ ఎమ్మెల్యే అజాం ఖాన్ కు ఎదురుదెబ్బ.. విద్వేష ప్రసంగం కేసులో జైలు శిక్ష.. అసెంబ్లీ సభ్యత్వంపై వేటు..

Published : Oct 29, 2022, 12:03 AM IST
సమాజ్‭వాదీ ఎమ్మెల్యే అజాం ఖాన్ కు ఎదురుదెబ్బ.. విద్వేష ప్రసంగం కేసులో జైలు శిక్ష.. అసెంబ్లీ సభ్యత్వంపై వేటు..

సారాంశం

విద్వేష పూరిత ప్రసంగం కేసులో  సమాజ్‭వాదీ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్ కు జైలు శిక్ష ఖరారైన విషయం తెలిసిందే. ముందుగా ఊహించిన విధంగా ఆయన తన అసెంబ్లీ సభ్యత్వంపై వేటుపడింది. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవిని   కోల్పోయారు. ఈ మేరకు యూపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

సమాజ్‭వాదీ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. విద్వేషపూరిత ప్రసంగం కేసులో మూడేళ్ల శిక్ష ఖరారు అయిన విషయం తెలిసింది. అయితే..తాజాగా.. అందరూ ముందుగానే ఊహించిన విధంగా శుక్రవారం (అక్టోబర్ 28)నాడు  ఆయన అసెంబ్లీ సభ్యత్వంపై వేటు పడింది. దీంతో  ఆయన తన ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సెక్రటేరియట్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాంపూర్ సదర్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉందని అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించిందని యూపీ విధానసభ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ దూబే తెలిపారు.

యుపి డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ట్వీట్ చేస్తూ.." విధానసభ సభ్యులు మహ్మద్ ఆజం ఖాన్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ స్వీకర్  తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినది! ఖాళీగా ఉన్న అసెంబ్లీకి ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా బిజెపి కమలం వికసిస్తుంది!" అని పేర్కొన్నారు. 

జైలు శిక్ష, జరిమానా  

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని ఎమ్మెల్యే,ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్‌ను రెచ్చగొట్టే ప్రసంగం కేసులో దోషిగా నిర్ధారించి మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అదే సమయంలో రూ.25,000 జరిమానా విధించడం గమనార్హం. జులై 2013లో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏదైనా కేసులో రెండేళ్లకు పైగా శిక్ష పడినట్లయితే.. శిక్ష విధించిన రోజు నుంచి వారి సభ్యత్వాన్నిరద్దు చేయబడుతుంది.  

 రెచ్చగొట్టే ప్రకటనలు

2019లో మిలక్ కొత్వాలి ప్రాంతంలోని ఖతానగారియా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆజం ఖాన్ మాట్లాడుతూ.. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగంలోని సీనియర్ అధికారులను మంచి చెడ్డలను ఉద్దేశించి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల పట్ల అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు ఆజం ఖాన్‌పై కేసు నమోదు చేయబడింది. ఈ నేపథ్యంలో  ఆజం ఖాన్ చేసిన ఈ ప్రకటన వీడియో కూడా వైరల్‌గా మారింది.

అయితే ఈ కేసులో గురువారం ఆజం ఖాన్‌కు బెయిల్ లభించింది. కోర్టు నిర్ణయం తర్వాత.. ఆయన మాట్లాడుతూ.. "ఇది గరిష్ట శిక్ష. ఈ కేసులో, బెయిల్ తప్పనిసరి షరతు మరియు దీని ఆధారంగా నాకు బెయిల్ వచ్చింది. నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu