గులాబీ పూరేకులపై అయోధ్యరామయ్య.. రామాలయంలో ఆకట్టుకోనున్న పూలచిత్రాలు...

By SumaBala BukkaFirst Published Jan 3, 2024, 3:24 PM IST
Highlights

ఈ వైభవానికి పూల సొగసును జోడిస్తూ, గుజరాత్‌కు చెందిన పూల వ్యాపారి అశోక్ బన్సాలీ ఆలయ సముదాయానికి ప్రత్యేకమైన పూల అలంకారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 

అయోధ్య : జనవరి 16న ప్రారంభమయ్యే ఏడు రోజుల మెగా వేడుకకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు రామ్ కథా పార్క్‌లో పూల కళాఖండాలను శ్రద్ధగా రూపొందిస్తున్నారు. ఈ డిజైన్‌లలో భక్తుల ఆరాధ్యదైవమైన రాముడు కొలువు తీరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీరాముడు, రాముడి విల్లు, బాణాలు, హనుమంతుడు, పవిత్ర తిలకంలాంటివి ఈ పువ్వుల రేకులపై ముద్రించడం అందర్నీ ఆకట్టుకుంటోంది. 

అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి సన్నాహాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంతో భాగంగానే రామ మైదానాన్ని అలంకరించడానికి భారతదేశం అంతటినుంచీ అద్భుతమైన కానుకలు అందాయి. వీటిల్లో 108-అడుగుల పొడవైన అగర్ బత్తి, గంభీరమైన బంగారు విల్లు, బాణం.. ఎనిమిది లోహాల కలయికతో రూపొందించిన ఆకట్టుకునే 2,100 కిలోల గంటలు ఉన్నాయి. ఇవన్నీ ఆలయ ప్రాంగణంలో కొలువు దీరబోతున్నాయి. 

Latest Videos

అయోధ్యలో విమానాశ్రయానికి వాల్మీకి మహర్షి పేరు.. ఇంతకీ వాల్మీకి ఎవరు?

ఈ వైభవానికి పూల సొగసును జోడిస్తూ, గుజరాత్‌కు చెందిన పూల వ్యాపారి అశోక్ బన్సాలీ ఆలయ సముదాయానికి ప్రత్యేకమైన పూల అలంకారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పువ్వులు, రామ్ లల్లా పేరు, "జై శ్రీ రామ్" అనే పేర్లు ముద్రించారు. విల్లు పట్టుకున్న రాముడి ఫొటోకూడా ముద్రించారు. 

బన్సాలీ పూల రేకులపై అక్షరాలు, బొమ్మలను ముద్రించే సాంకేతికతను అభివృద్ధి చేయడానికి నాలుగు సంవత్సరాలు శ్రమించారు. ఈ టెక్నాలజీతో బన్సాలీ "రామ్ లల్లా", "ఆత్మనిర్భర్ భారత్" వంటి వాటితోపాటు ప్రధాని నరేంద్ర మోడీ, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రాలను కూడా గులాబీ రేకుల మీద ముద్రించాడు వాటిని కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. 

'మేక్ ఇన్ ఇండియా' చొరవ నైతికతతో, బన్సాలీ ప్రతి రేకుపై చేతితో వీటిని ఎంతో ఓపికగా, సమయాన్ని వెచ్చించి ముద్రించారు. ఆలయ సముదాయం కోసం ఏర్పాటు చేస్తున్న ఇండోర్ మొక్కల ఆకులపై ఇలాంటి చిత్రాలను ముద్రించాలని బన్సాలీ యోచిస్తున్నారు.

2020లో జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి, బన్సాలీ ఇలాంటి ముద్రించిన 500 పూలను అందించారు. ఇప్పుడు రామమందిర ప్రారంభోత్సవారిని శ్రీరాముని పూజ కోసం 3,000 నుండి 4,000 వరకు ఇలాంటి అద్భుతమైన పూల కానుకను అందించాలనుకుంటున్నాడు. 

జనవరి 16న ప్రారంభమయ్యే ఏడు రోజుల మెగా వేడుకకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు రామ్ కథా పార్క్‌లో పూల కళాఖండాలను శ్రద్ధగా రూపొందిస్తున్నారు. ఈ డిజైన్‌లు రాముడు, రామ చిహ్నమైన విల్లు, బాణం, హనుమంతుడు, పవిత్ర తిలకంలు ఆ పూలపై చిత్రిస్తున్నారు. 

జనవరి 22న జరిగే పవిత్రోత్సవం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో జరగనుంది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా మారనుంది. 

click me!