అయోధ్య తీర్పు నేటి ఉదయం 10.30కు వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఒకసారి అసలు ఈ వివాదం ఎలా ప్రారంభమయ్యింది,ఎప్పటినుండి ప్రారంభమైంది, వాదనలు ఎలా కొనసాగాయో తెలుసుకుందాం.
స్వాతంత్య్రానంతరం మొదలైన వివాదంలో మొదటి కోర్టు కేసు నమోదైన డెబ్బై సంవత్సరాల తరువాత, ఈ రోజు బాబ్రీ మసీదు-రామ్ జన్మభూమి భూ వివాదంలో సుప్రీంకోర్టు నేడు తన తీర్పు వెలువరించింది. దశాబ్దాలుగా దేశ రాజకీయ చర్చను ప్రభావితం చేసిన ఈ వివాదం అనేక మలుపులు తిరిగి, వివిధ కోర్టు మెట్లెక్కింది.
Also read: Ayodhya Verdict... అయోధ్య తీర్పు... ఈ రోజే ఎందుకు..?
undefined
ఉత్తర ప్రదేశ్, అయోధ్యలో ఉన్న ఒక పురాతన మసీదును 1992 లో హిందూ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ప్రదేశం రాముడి జన్మస్థలం అని నమ్ముతారు. ఈ పరిస్థితుల తదనంతరం చెలరేగిన అల్లర్లలో దాదాపుగా 2,000 మంది మరణించారు. ఈ భూమి ఎవరికీ చెందుతుందనే దానిపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పును వెలువరించనుంది.
బాబ్రీ మసీదును 1528 లో అయోధ్యలో నిర్మించారు. ఒక ఆలయాన్ని కూల్చివేసిన తరువాత దీనిని నిర్మించినట్లు హిందూ వర్గాలు పేర్కొంటాయి. 1853 లో, ఈ స్థలంపై మొట్టమొదటిసారిగా మత ఘర్షణలు జరిగాయి. 1859 లో, బ్రిటీష్ పరిపాలకులు హిందువులకు, ముస్లింలకు వేర్వేరు ఆరాధనా స్థలాలుగా విభజిస్తూ ఆ ప్రదేశం చుట్టూ కంచె వేశారు.
ఇది దాదాపు 90 సంవత్సరాలు ఆ విధంగా ఉంది. 1949లో రాముడి విగ్రహాలను మసీదు లోపల ఏర్పాటు చేసిన తరువాత 1949 లో ఈ ఆస్తి వివాదం మొదటిసారి కోర్టు మెట్లెక్కింది
1984 లో హిందూ సంఘాలు రాముడి ఆలయ నిర్మాణం చేపట్టడానికి ఒక కమిటీగా ఏర్పడ్డారు. మూడు సంవత్సరాల తరువాత, దాదాపు ఐదు దశాబ్దాలుగా మూసి ఉన్న మసీదు ద్వారాలను తెరవాలని జిల్లా కోర్టు ఆదేశించింది. "వివాదాస్పద కట్టడంలో" లోపల హిందువులకు రాముడిని ఆరాధించడానికి అనుమతించింది.
Also read: Video: అయోధ్య కేసు: రవిశంకర్ కమిటీ నివేదికనే పరిష్కారం?
ఈ నేపథ్యంలో ముస్లిం గ్రూపులు బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశాయి. 1989 లో, "వివాదాస్పద కట్టడం" పక్కనే ఉన్న భూమిలో ఆలయ నిర్మాణానికి పునాదులు పడ్డాయి.
1990 లో, అప్పటి బిజెపి అధ్యక్షుడు ఎల్ కే అద్వానీ ఈ ప్రదేశంలో రాముడి ఆలయాన్ని నిర్మించటానికి మద్దతు కూడగట్టడానికి రథయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో చెలరేగిన స్వల్ప అల్లర్లలో బాబ్రీ మసీదు పాక్షికంగా ధ్వంసమయ్యింది.
1992 డిసెంబర్ 6 న క్రియాశీలకమైన హిందూ కార్యకర్తలు ఈ మసీదును కూల్చివేశారు. భారతదేశం అంతటా మత కలహాలు జరిగాయి. కూల్చివేసిన పది రోజుల తరువాత, ఈ సంఘటనపై దర్యాప్తు జరపడానికి లిబర్హాన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కమిషన్ తన నివేదికను జూన్ 2009 న17 సంవత్సరాల తరువాత సమర్పించింది. ఎల్ కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఇతర బిజెపి నాయకుల పేర్లను పొందుపరుస్తూ ఈ కమిషన్ తన నివేదికను ఇచ్చింది.
బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన కేసులో కొందరు ప్రముఖ బిజెపి నాయకులతో సహా, ఏడుగురు హిందూ సంస్థలకు చెందిన నాయకులను విచారణకు హాజరవ్వాలని 2003 సెప్టెంబరులో కోర్టు ఆదేశించింది. కానీ, అప్పటి ఉప ప్రధానిగా ఉన్న అద్వానీ పేరు అందులో ఉండకపోవడం గమనార్హం. సంవత్సరం తరువాత, అద్వానీ ని ఈ కేసులో అద్వానీ పేరు లేకుండా ఇచ్చిన ఉత్తర్వును సమీక్షించాలని ఉత్తర ప్రదేశ్ కోర్టు తీర్పు ఇచ్చింది.
Also read: నేడే అయోధ్య తీర్పు... ఇది ఎవరి విజయం కాదు.. ప్రధాని మోదీ
మురలి మనోహర్ జోషి, ఉమా భారతితో సహా బిజెపి నాయకులపై ఉన్న కేసును లక్నోలోని ట్రయల్ కోర్టు విచారిస్తోంది. ఈ ఏడాది జూలైలో సుప్రీంకోర్టు ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి పదవీకాలాన్ని పొడిగించి తీర్పు వెలువడించడానికి తొమ్మిది నెలల గడువును నిర్ణయించింది.
ఏప్రిల్ 2002 లో, ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన అలాహాబాద్ హైకోర్టు కు చెందిన లక్నో బెంచ్ ఈ భూ వివాదంపై విచారణ ప్రారంభించింది. సెప్టెంబర్ 2010 లో అలహాబాద్ హైకోర్టు తన తీర్పును ప్రకటించింది. బాబ్రీ మసీదు స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలని తీర్పులో పేర్కొంది. భూమిని మూడు భాగాలుగా విభజిస్తూ, ఈ కేసులో పెటిషనర్లుగా ఉన్న నిర్మోహి అఖారా, రామ్ లల్లా, ఉత్తర ప్రదేశ్ లోని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డులకు ఒక్కొక్కరికి ఒక్కో భాగం చెందాలని తెలిపింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నెలల్లోపే హిందూ గ్రూపులు, ముస్లిం గ్రూపులు ఎవరికీ వారుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
2011 లో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కొంతకాలం ముందు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వింతగా, విస్తుపోయేదిగా ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది.
ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించడానికి ముగ్గురు మధ్యవర్తులతోని ఒక బృందాన్ని నియమించింది. నియమించిన ముగ్గురు సభ్యుల బృందం, పరిష్కారం కనుగొనడంలో విఫలమైన తరువాత, ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 6 నుండి రోజువారీ విచారణలను ప్రారంభించింది.
అక్టోబర్ 16 న 40 రోజుల సుదీర్ఘ రోజువారీ విచారణల తరువాత ఈ విచారణ ముగిసింది. ఈ తీర్పును రిజర్వ్ చేసి నవంబర్ 17 లోపు ప్రకటించనున్నట్టు తెలిపారు. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం జరుపుతున్న విచారణకు నాయకత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ 17న పదవీ విరమణ చేయనున్నారు.