శ్రీరామ జన్మభూమి అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ గర్భగుడి ఫోటోలను రామ్ మందిర్ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ ఎక్స్‌లో షేర్ చేశారు.
శ్రీరామ జన్మభూమి అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ గర్భగుడి ఫోటోలను రామ్ మందిర్ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ ఎక్స్‌లో షేర్ చేశారు. జనవరి 22న ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించి మందిరాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్మాణ కమిటీ ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అత్యంత ఘనంగా జరగనున్న శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు దేశంలోని 8 వేల మందికి పైగా ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.
प्रभु श्री रामलला का गर्भ गृह स्थान लगभग तैयार है। हाल ही में लाइटिंग-फिटिंग का कार्य भी पूर्ण कर लिया गया है। आपके साथ कुछ छायाचित्र साझा कर रहा हूँ। pic.twitter.com/yX56Z2uCyx
— Champat Rai (@ChampatRaiVHP)
ప్రధాన ఉత్సవానికి వారం ముందు అంటే వచ్చే ఏడాది జనవరి 16న ప్రతిష్ఠాపన వేడుక వైదిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వారణాసికి చెందిన వేద పూజారి లక్ష్మీ కాంత్ దీక్షిత్ జనవరి 22, 2024న రామ్ లల్లా పవిత్రోత్సవం యొక్క ప్రధాన ఆచారాన్ని నిర్వహిస్తారు. అంతకంటే ముందే రామమందిరం మొదటి అంతస్తు నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. రామ్‌లాలా పవిత్రోత్సవం కోసం వీహెచ్‌పీ ప్రత్యేక సన్నాహాలు చేస్తోంది.
ప్రతిరోజూ పూజించే అక్షత మహా ఆరతి జరుగుతుంది. ఈ నిర్మాణ పనులకు సంబంధించిన డ్రోన్ ఐ వ్యూ చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం సోమవారం (నవంబరు 20)విడుదల చేసింది. ఈ చిత్రాలను రామ్ జన్మభూమి ట్రస్ట్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ చిత్రాలను పరిశీలిస్తే.. ఆ ఆలయ వైభవం ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు. ఆలయ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.
శ్రీ రామ జన్మభూమి దేవాలయం
జ్యోతిష్యులు, వేద అర్చకులతో సంప్రదింపుల తర్వాత శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22 న మధ్యాహ్నం 12 నుండి 12.45 గంటల మధ్య రామాలయంలోని గర్భగుడిలో రామ్ లాలాను ప్రతిష్టించాలని నిర్ణయించింది. శంకుస్థాపన (పవిత్ర) కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొంటారు.
అలాగే.. యూపీ సీఎం యోగి, గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ కూడా హాజరుకానున్నారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ప్రోటోకాల్ ప్రకారం (ప్రధానమంత్రి సమక్షంలో) కార్యక్రమానికి గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరవుతారని తెలిపారు. ప్రధాని వెళ్లిన తర్వాతే ఆహ్వానితులకు రామ్ లల్లా దర్శనం లభిస్తుందని ఆయన అన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ట్రస్ట్ అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను రామ్‌లల్లా పట్టాభిషేక కార్యక్రమానికి ఆహ్వానించింది.