
Ayodhya Deepostav 2025 : ఈసారి కేవలం అయోధ్య వైభవం, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలవడమే కాదు, సాంకేతిక భద్రత, జన నిర్వహణకు కూడా అయోధ్య దీపోత్సవం ఒక గొప్ప ఉదాహరణగా నిలవనుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు మొదటిసారిగా మహాకుంభమేళా తరహాలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కెమెరాలను ఈ దీపోత్సవంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
భద్రత, జన నియంత్రణ కోసం దీపోత్సవ వేడుకలు జరిగే ప్రాంతమంతటా 11 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు లతా చౌక్, ధర్మ పథ్, రామ్ పథ్, రామ్ కీ పైడి వద్ద లైవ్ లో జనసమీకరణను పర్యవేక్షిస్తాయి. భద్రతను పక్కాగా చూసుకోవడానికి, ప్రతిచోటా వచ్చిపోయే భక్తులపై నిఘా ఉంచడానికి ఈ ఏఐ కెమెరాలు ఉపయోగపడతాయి.
డీఎం నిఖిల్ టికారమ్ ఫుండే మాట్లాడుతూ… ఏఐ కెమెరాలు జన సమూహాన్ని లెక్కించడమే కాకుండా, అనుమానిత వ్యక్తులను కూడా గుర్తిస్తాయని తెలిపారు. ఏదైనా ప్రాంతంలో జనం ఎక్కువగా ఉంటే కెమెరాలు వెంటనే హెచ్చరికలు పంపుతాయన్నారు. దీని ద్వారా వెంటనే క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేస్తామన్నారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు మొత్తం 11 ఏఐ కెమెరాలు యాక్టివ్ మోడ్‌లో ఉంటాయి. వేడుకల ప్రాంతంలో వీటి టెస్టింగ్ పూర్తయింది. దీపోత్సవం సమయంలో ఈ కెమెరాల ద్వారా వచ్చే, పోయే భక్తులను రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తారు.
ఏఐ క్రౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అమలుతో భద్రత, క్రమశిక్షణ, సౌకర్యం మూడు పక్కాగా ఉంటాయి. అధికారులకు లైవ్ అప్‌డేట్స్ అందుతాయి, దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో వెంటనే చర్యలు తీసుకోవచ్చు.
దీపోత్సవం కేవలం మతపరంగానే కాకుండా, ఆధునిక టెక్నాలజీ వాడకంతో భద్రతా వ్యవస్థ పరంగా కూడా ఒక ఆదర్శంగా నిలవాలన్నది యోగి ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. దీనికోసం వేడుకల ప్రాంతమంతటా ఏఐ కెమెరాలను ఇన్‌స్టాల్ చేశామన్నారు.