అక్రమ ధనార్జన కేసు: అవంత గ్రూప్ ప్రమోటర్ థాపర్ అరెస్టు

By telugu teamFirst Published Aug 5, 2021, 8:08 AM IST
Highlights

అక్రమ ధనార్జన కేసులో అవంత గ్రూప్ ప్రమోటర్, వ్యాపారవేత్త థాపర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. మంగళవారం రాత్రి థాపర్ ను అరెస్టు చేసినట్లు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది.

న్యూఢిల్లీ: అవంత గ్రూప్ ప్రమోటర్, వ్యాపారవేత్త థాపర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. అక్రమ ధనార్జన కేసులో థాపర్ ను అరెస్టు చేసినట్లు ఈడీ ప్రకటించింది. అక్రమ ధనార్జన నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద 60 ఏళ్ల వయస్సు గల థాపర్ ను మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు తెలిపింది. 

ఢిల్లీ, ముంబైల్లోని అతని వ్యాపారాలకు సంబంధించిన పలు కార్యాలయాలపై ఈడీ అంతకు ముందు దాడులు నిర్వహించింది. ఇప్పటికే విచారణను ఎదుర్కుంటున్న యస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకులు రాణా కపూర్, ఆయన భార్య బిందు అక్రమ ధనార్జన కేసులో థాపర్ ప్రమోటర్ గా ఉ్న అవంత రియల్టీ పాత్ర కూడా ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.

కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను ప్రాతిపదికగా తీసుకుని ఈడీ ఈ కేసును విచారిస్తోంది. అవంత రియల్టీ రుణ సౌలభ్యతల్లో రాయితీలు, సడలింపులు, మినహాయింపులు పొడగింపు, అదనపు రుణ అడ్వాన్స్ ల వంటి అంశాల్లో నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ ధనార్జన, ఆస్తుల క్రయవిక్రయ లావాదేవీలు జరిగినట్లు సిబిఐ ఎఫ్ఐఆర్ లో తెలిపింది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తదితర బ్యాంకుల్లో రూ. 2,43 కోట్ల మోసానికి పాల్పడినట్లు థాపర్ సహా పలువురిపై సిబిఐ గత నెలలో అభియోగాలు మోపింది. సీజీ పవర్ అండ్ ఇండిస్ట్రియల్ సొల్యూషన్స్ మోసపూరిత కేసు విచారణలో భాగంగా ఈ కేసు నమోదైంది.

click me!