భార్య సోదరుడిగా భావించే యువకుడిని హత్య చేసిన భర్త.. వంటింట్లో శరీర భాగాలు.. అసలేం జరిగిందంటే..

Published : Aug 31, 2023, 11:32 AM IST
భార్య సోదరుడిగా భావించే యువకుడిని హత్య చేసిన భర్త.. వంటింట్లో శరీర భాగాలు.. అసలేం జరిగిందంటే..

సారాంశం

ఓ ఆటో డ్రైవర్ తన భార్య సోదరుడిగా భావించే 17 ఏళ్ల యువకుడిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు.

ఓ ఆటో డ్రైవర్ తన భార్య సోదరుడిగా భావించే 17 ఏళ్ల యువకుడిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని చోటుచేసుకుంది. వివరాలు.. నిందితుడు షఫీక్ అహ్మద్ షేక్ చెంబూర్‌లోని ఆర్‌సీఎఫ్ ప్రాంత పరిధిలోని ఎంహెచ్ఏడీఏ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. బాధితుడు ఈశ్వర్ అవద్‌కు షేక్ భార్య కుటుంబానికి చాలా కాలంగా తెలుసు. షేక్ భార్య, ఆమె సోదరి.. ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా ఈశ్వర్ అవద్‌ను వారి సోదరుడిలా చూసుకున్నారని అతను చెప్పాడు.

షేక్ తరచుగా ఈశ్వర్ అవద్ తన భార్య, ఆమె సోదరి గురించి వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. అయితే ఈశ్వర్ అవద్ అలా చేయడం మానకపోవడంతో కోపంతో రగిలిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఈశ్వర్ అవద్‌ను తన నివాసం ఉంటున్న ఫ్లాట్‌కు తీసుకెళ్లిన షేక్‌.. అతడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. 

అయితే ఈశ్వర్ కనిపించకుండా పోవడంతో.. షేక్ మామ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఈశ్వర్ చివరిగా షేక్‌తో కనిపించినట్టుగా గుర్తించారు. దీంతో షేక్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో.. ఈశ్వర్‌ను హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో షేక్ నివాసంలోని వంట గది నుంచి ఈశ్వర్ శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఇక, ఈశ్వర్‌ను కొడవలితో చంపిన తర్వాత, షేక్ అతని తలపై సుత్తితో కొట్టాడని పోలీసులు తెలిపారు. తాము కొడవలి, సుత్తిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. షేక్‌పై భారత శిక్షాస్మృతి సెక్షన్లు 302 (హత్య), 201 (సాక్ష్యం అదృశ్యం) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం