రాజ కుటుంబీకులకు సుధామూర్తి నమస్కారం... నెట్టింట చర్చ..!

Published : Sep 28, 2022, 09:43 AM IST
  రాజ కుటుంబీకులకు సుధామూర్తి నమస్కారం... నెట్టింట చర్చ..!

సారాంశం

ఈ రోజుల్లోనూ ఇలాంటి సంప్రదాయాన్ని పాటించడమేంటని తప్పుపడుతున్నారు. అయితే.. కొందరు నెటిజన్లు మాత్రం ఆమె చేసిన పనిని సమర్థిస్తున్నారు. అయితే... చాలా మంది ఆమె చేస్తున్న పనిని తప్పు పడుతుండటం గమనార్హం. 

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధామూర్తి గురించి తెలియనివారు ఉండరు. ఆమె ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ గా మాత్రమే కాకుండా ఆమె చేసే పరోపకారాలతో కూడా ఆమె మంచి పేరు తెచ్చుకుంది. అయితే... తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అందులో.... ఆమె చేసిన పనిని కొందరు ప్రశంసిస్తుంటే... మరి కొందరు విమర్శిస్తుండటం గమనార్హం.

ఆ ఫోటోలో సుధామూర్తి... మైసూరు రాజ కుటుంబానికి చెందిన ప్రమోదా దేవి వడియార్ ముందు నమస్కరిస్తున్నట్లు కనిపించారు. నటి బి. సరోజాదేవిని కూడా మనం ఫ్రేమ్‌లో గుర్తించవచ్చు. మైసూర్ రాష్ట్ర చివరి పాలకుడు జయచామరాజ వడియార్ జన్మ శతాబ్ది ఉత్సవాలకు హాజరు కావడానికి  సుధా మూర్తిని ఆహ్వానించినప్పుడు..2019లోని చిత్రం ఇది.

 

అయితే... సుధామూర్తి అలా రాజకుటుంబీకులకు నమస్కారం చేయడాన్ని నెటిజన్లు తప్పుపడుతుండటం గమనార్హం. రాజ కుటుంబీకులు కాబట్టి అలా నమస్కారం చేశారా అంటూ కొందరు విమర్శించడం గమనార్హం. ఈ రోజుల్లోనూ ఇలాంటి సంప్రదాయాన్ని పాటించడమేంటని తప్పుపడుతున్నారు. అయితే.. కొందరు నెటిజన్లు మాత్రం ఆమె చేసిన పనిని సమర్థిస్తున్నారు. అయితే... చాలా మంది ఆమె చేస్తున్న పనిని తప్పు పడుతుండటం గమనార్హం. అందరికీ ఓ రోల్ మోడల్ లా ఉండాల్సిన ఆమె.... అలా చేయడం కరెక్ట్ కాదని చాలా మంది భావిస్తుండటం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్