జైపూర్ మర్డర్‌లో కీలక విషయం వెలుగులోకి.. ఢిల్లీ సత్సంగ్‌కు వెళ్లొద్దన్నందుకే హత్య.. ఏడేళ్లుగా ‘హరే క్రిష్ణ’తో

By Mahesh KFirst Published Dec 18, 2022, 5:17 PM IST
Highlights

జైపూర్ మర్డర్ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు హరే క్రిష్ణ మూవ్‌మెంట్‌తో ఏడెనిమిది సంవత్సరాలుగా ఉన్నాడని తెలిసింది. ఢిల్లీలో ఓ సత్సంగ్ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నందుకే ఆ మహిళను నిందితుడు దారుణంగా చంపేశాడని పోలీసులు తాజాగా వెల్లడించారు.
 

న్యూఢిల్లీ: రాజస్తాన్ జైపూర్‌లో 32 ఏళ్ల వ్యక్తి 64 ఏళ్ల తన బంధువైన మహిళను చంపేసి ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి ఢిల్లీ హైవే సమీపంలో వేర్వేరు చోట్ల వేసిన ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను నిందితుడు ఓ సుత్తెతో కొట్టి చంపాడని, ఆ తర్వాత కత్తి, మార్బుల్ కట్టర్‌తో బాడీని కట్ చేశాడని పోలీసులు తెలిపారు. పోలీసు దర్యాప్తులో విస్మయకర విషయాలు బయటకు వస్తున్నాయి. 

నిందితుడు ఢిల్లీలో నిర్వహించిన సత్సంగ్‌కు హాజరవ్వాలని అనుకున్నాడని, కానీ, ఆంటీ అతడిని వెళ్లడానికి అనుమతించలేదని పోలీసులు తెలిపారు. సత్సంగ్ కార్యక్రమానికి వెళ్లనివ్వట్లేదన్న ఆగ్రహంతో అతడు తన ఆంటీనే చంపేశాడు. హరే క్రిష్ణ మూవ్‌మెంట్‌తో అతడు గత ఏడు, ఎనిమిది సంవత్సరాలుగా ప్రయాణిస్తున్నాడు.

డిసెంబర్ 11న నిందితుడు అనుజ్ శర్మ తండ్రి ఇండోర్‌కు వెళ్లాడు. అప్పుడు నిందితుడు, బాధితురాలు మాత్రమే ఇంటిలో ఉన్నారు. అనుజ్ ఢిల్లీకి వెళ్లాలని అనుకున్నాడు. కానీ, ఆమె వద్దని చెప్పంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ కోపంలోనే ఆమెపై సుత్తెతో దాడి చేశాడు. ఆమె చనిపోయింది. అనంతరం, ఆమె బాడీని ముక్కలుగా చేశాడు.

Also Read: లివ్ ఇన్ పార్ట్‌నర్‌ను కొడవలితో నరికి చంపిన వ్యక్తి.. జైలులో ఆత్మహత్య

‘ఓ ప్రైవేటు కాలేజీలో అనుజ్ సుమారు పదేళ్ల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ కూడా చేశాడు. కానీ, ఆ జాబ్ మానేశాడు. హరే క్రిష్ణ మూవ్‌మెంట్‌తో ఇన్‌స్పైర్ అయిన అనుజ్ శర్మ జాబ్ వదిలిపెట్టాడు. 2012, 13 కాలంలో వారిని ఓ గుడిో కలిశాడు. అనంతరం, అతను తన పేరును అచింత్య గోవింద్ దాస్‌గా మార్చుకున్నాడు’ అని పోలీసులు తెలిపారు. కరోనా కాలంలో అనుజ్ తల్లి మరణించింది. అప్పటి నుంచి ఆంటీనే అతడి ఆలనా పాలనా చూసింది.

click me!