
తమిళనాడు : ఓ అత్త దారుణానికి ఒడిగట్టింది. అనుమానంతో.. కోడలి మీద ఏ అత్తా చేయని పాశవికదాడి చేసింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది. కోడలి ప్రవర్తన మీద అనుమానం వచ్చిన ఆ అత్త.. యాసిడ్తో ఆమె మీద దాడి చేసింది. ఈ విస్మయకర ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కలివరదన్, ఆండాళ్ దంపతులు తమిళనాడులోని కడలూరు జిల్లా విరుదాచలానికి చెందిన వారు. వీరి పెద్ద కొడుకు ముకేశ్ రాజ్.. అతడికి ఆండాళ్ తన మేనకోడలైన కృత్తికను ఇచ్చి పెళ్లి చేసింది. ఇది జరిగే ఏడేళ్లు అవుతుంది. ముఖేష్ రాజ్, కృత్తికకు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు.
ముఖేష్ రాజ్ తమిళనాడు అవినాశిలోని ఓ బట్టల షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భర్త ముకేశ్ రాజ్, అత్త ఆండాళ్… కృత్తిక మీద అనుమానం పెంచుకున్నారు. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని వేధించడం మొదలుపెట్టారు. ఆమెతో ఈ విషయంగా తరచుగా గొడవ పడుతుండేవారు. ఈ గొడవలు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో అత్త సోమవారం తెల్లవారుజామున దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో నిద్రిస్తున్న కోడలిపై యాసిడ్ తో దాడి చేసింది. కోడలి ముఖం, చేతులు, కాళ్లు, మర్మాంగంపై యాసిడ్ పోసింది.
వారంలో మూడు రోజులు ఒక భార్యతో.. మరో మూడు రోజులు మరో భార్యతో.. ఆదివారం నీ ఇష్టం..అసలు కథేంటంటే...
అంతటితో ఆమె కసి తీరలేదు.. దోమలు రాకుండా వాడే లిక్విడ్ ను కోడలి నోట్లో పోసింది. ఈ దాడితో మెలకువ వచ్చిన కృత్తిక మంటలు భరించలేక కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకున్నారు. కృత్తికను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను చేర్చుకున్న వైద్యులు చికిత్స మొదలుపెట్టారు. అయితే యాసిడ్ దాడి వల్ల.. బాధితురాలికి కుడి కన్ను చూపుపోయింది. దీని మీద పోలీసులకు ఫిర్యాదు అందడంతో.. కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అరెస్టు చేశారు.