ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో దారుణం.. గొడ‌వ చేయొద్ద‌ని మంద‌లించాడ‌ని ప్రిన్సిపాల్ ను గ‌న్ తో కాల్చిన స్టూడెంట్..

By team teluguFirst Published Sep 25, 2022, 12:45 PM IST
Highlights

ప్రిన్సిపాల్ మందలించాడని ఓ విద్యార్థికి కోపం వచ్చింది. ఓ గన్ తీసుకొచ్చి నేరుగా ప్రిన్సిపాల్ గదికి వెళ్లి కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. సీతాపూర్‌లో శనివారం 12వ తరగతి చ‌దివే విద్యార్థి ప్రిన్సిపాల్‌పై కాల్పులు జరిపాడు. ఆ విద్యార్థి మూడు రౌండ్లు పేల్చి, నాలుగో బుల్లెట్ ను కాల్చ‌బోతున్నాడు. ఈ స‌మ‌యంలో పాఠ‌శాల సిబ్బంది చేరుకోవ‌డంతో అక్క‌డి నుంచి పారిపోయాడు. 

ఆర్‌ఎస్‌ఎస్ నేత ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు.. వరుస ఘటనలతో కలకలం..

ఈ ఘటన సదర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ రామ్ స్వరూప్ ఇంటర్ కాలేజీలో జ‌రిగింది. ఓ ఇద్ద‌రు విద్యార్థులు ఘ‌ర్ష‌ణ ప‌డ్డార‌ని, వారిని ప్రిన్సిపాల్ రామ్ స్వరూప్ వర్మ మంద‌లిచ‌డంతో ఓ విద్యార్థి గుర్విందర్ సింగ్  ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడ‌ని తెలుస్తోంది. ఈ ఘ‌ట‌నపై సమాచారం అందుకున్న జిల్లా పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు.గాయపడిన ప్రిన్సిపాల్ ను బిస్వాలోని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప‌రిస్థితి విష‌మంగా మార‌డంతో ఆయ‌న‌ను ల‌క్నోలోని హాస్పిట‌ల్ కు రిఫ‌ర్ చేశారు. 

రెండో రోజే కనిపించుకుండా పోయిన భార్య.. మరో పెళ్లికి రెడీ.. పక్కా ప్లాన్‌తో వెలుగులోకి షాకింగ్ విషయాలు..

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలు కూడా బయటపడ్డాయి. ప్రిన్సిపాల్ రామ్ స్వరూప్ వర్మ శనివారం ఉదయం 8.30 గంటలకు తన గదిలో కూర్చున్నాడు. నిందితుడైన విద్యార్థి గుర్విందర్ సింగ్ పాఠశాలకు చేరుకున్నాడు. ఆ విద్యార్థి నేరుగా తరగతి గ‌దికి వెళ్లాడు. బ్యాగ్ లో నుంచి తుపాకీని తీసి నడుము వెనుక దాచుకున్నాడు. అక్క‌డ ఉన్న ఒక వాట‌ర్ బాటిల్ తీసుకొని నీరు తాగాడు. తర్వాత ప్రిన్సిపాల్‌ గదికి వెళ్లాడు.

బాలిస్టిక్ క్షిప‌ణిని ప్ర‌యోగించిన ఉత్త‌ర కొరియా.. కమలా హారిస్ ప‌ర్య‌ట‌నకు ముందు ప‌రిణామం..

ముందుగా ప్రిన్సిపాల్ ను ప‌లక‌రించాడు. అనంత‌రం అత‌డిని గ‌న్ తో కాల్చ‌డం మొద‌లుపెట్టారు. అనుకోని ఈ ప‌రిణామానికి ప్రిన్సిపాల్ షాక్ అయ్యాడు. వెంట‌నే గ్రౌండ్ వైపు ప‌రిగెత్త‌డం మొద‌లుపెట్టాడు. అత‌డి వెన‌కాలే విద్యార్థి కూడా ప‌రిగెత్తాడు. గ్రౌండ్ లోకి చేరుకున్న స‌మ‌యంలో రెండు రౌండ్లు గ‌న్ తో కాల్చాడు. అనంత‌రం ప్రిన్సిపాల్ ను ప‌ట్టుకున్నాడు. ఇద్ద‌రి మధ్య కాసేపు తోపులాట జరిగింది. దీంతో అక్క‌డ ప‌ని చేసే సిబ్బంది చేరుకున్నారు. గుర్విందర్ నాలుగో బుల్లెట్ లోడ్ చేస్తూ సిబ్బంది రావ‌డం గ‌మ‌నించి అక్క‌డి నుంచి పారిపోయాడు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ప్రిన్సిపాల్‌ వెన్నులో మూడు బుల్లెట్లు తగిలాయి. ప్ర‌స్తుతం అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.
 

click me!