దారుణం.. స్కూటర్ ను ఢీకొట్టిన ట్రక్.. 1.5 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లడంతో చెలరేగిన మంటలు.. బాధితుడు మృతి

By team teluguFirst Published Jan 6, 2023, 8:59 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూటర్ ను డంపర్ ట్రక్కు ఢీకొట్టింది. స్కూటర్ ను, దానిపై ఉన్న వ్యక్తిని దాదాపు ఒకటిన్నర కిలో మీటర్లు ఈడ్చుకెళ్లింది. దీంతో అతడు మరణించాడు. 

ఢిల్లీలోని కంఝవాలా ఘటన మర్చిపోక ముందే దేశంలో వరుసగా అలాంటి ప్రమాదాలే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లో కూడా ఇలాంటి ప్రమాదమే ఒకటి జరిగింది. ఓ స్కూటర్ ను డంపర్ ట్రక్ ఢీకొట్టి 1.5 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లింది. దీంతో మంటలు అంటుకోవడంతో బాధితుడు మరణించాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. 

పోలీసుల పట్ల అనుచిత ప్రవర్తన.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..

వివరాలు ఇలా ఉన్నాయి. అనంత దాస్ అనే వ్యక్తి వృత్తిరీత్యా వ్యాపారి. బాగ్డోగ్రాలోని స్థానిక వ్యాపార కేంద్రం నుంచి స్కూటర్ పై గురువారం రాత్రి సమయంలో తన ఇంటికి బయలుదేరాడు. రాత్రి 8.30 గంటల సమయంలో ఉత్తర బెంగాల్ విశ్వవిద్యాలయం క్యాంపస్ ముందుకు రాగానే ఓ డంపర్ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అతడు ట్రక్కు అంచులకు ఇరుక్కుపోయాడు.

ఈ ప్రమాదాన్ని ట్రక్కు డ్రైవర్ గమనించలేదో ఏమో గానీ ట్రక్కును ఆపకుండా అలాగే పోనిచ్చాడు. ఇలా దాదాపు 1.5 కిలో మీటర్లు ట్రక్కు ప్రయాణించింది. దీంతో రాపిడి వల్ల స్కూటర్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో అనంతదాస్ శరీరానికి కూడా ఆ మంటలు వ్యాపించాయి. అయితే దీనిని స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంటల్లో బాధితుడి శరీరం కాలిపోయింది. దీంతో అతడు మరణించాడు. ఈ ఘటనలో డంపర్ ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పాకిస్థాన్‌తో సంబంధాలున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌పై కేంద్రం వేటు..

ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జనవరి 1వ తేదీన జరగ్గా.. గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ అయిన స్విగ్గీలో కౌశల్ యాదవ్ అనే 24 ఏళ్ల యువకుడు డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. ఆయన ఎటావాలో నివసిస్తున్నాడు. అయితే న్యూ ఇయర్ రోజు రాత్రి ఓ ఆర్డర్ రావడంతో ఫుడ్ డెలివరీ చేయడానికి నోయిడా సెక్టార్ 14లోని ఫ్లైఓవర్ పై తన బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ కారు అతడి బైక్ ను ఢీకొట్టింది. అతడు కింద పడిపోగానే కారు ఆపకుండా దాదాపు 500 మీటర్లు ఈడ్చుకెళ్లింది.

అయితే ఆదివారం తెల్లవారుజామున 1 గంటలకు కౌశల్ సోదరుడు అమిత్ అతడికి ఫోన్ చేశాడు. కానీ బాధితుడు అప్పటికే మరణించడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాడు. అయితే అటుగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి ఈ ప్రమాదం గురించి తెలియజేశాడు. దీంతో అమిత్ పోలీసులకు సమాచారం అందించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఎన్ఐఏ దూకుడు .. కర్ణాటకలో పలు చోట్ల దాడులు.. ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ కార్యకర్తల అరెస్టు..

ఈ ఏడాది మొదటి రోజునే ఢిల్లీలో ఇదే తరహా మొదటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ శివార్లలో కాంఝవాలా ప్రాంతంలో ఓ స్కూటీని కారు ఢీకొట్టింది. 20 ఏళ్ల అంజలి ఆ కారు కింద ఇరుక్కుపోయింది. సుమారు 12 కిలో మీటర్ల పాటు కారు ఆమెను ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఆమె తీవ్రగాయాలతో మరణించింది. ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా భావిస్తున్న నిందితులు దీపక్ ఖన్నా, అమిత్ ఖన్నా, క్రిషన్, మిథున్, మనోజ్ మిట్టల్ అనే ఐదుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

click me!