దారుణం.. కూతురును తరచూ కొడుతోందని.. ఏడేళ్ల మేనకోడలి హత్య..

By Asianet News  |  First Published Oct 15, 2023, 10:19 AM IST

కూతురును తన మేనకోడలిని తరచూ కొడుతోందని ఓ వ్యక్తి భావించాడు. ఆ చిన్నారిపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. వాకింగ్ కు అని తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.


మేనకోడలిపై ఓ మేనమామ క్రూరంగా ప్రవర్తించాడు. తన కూతురును తరచూ కోడుతోందనే కారణంతో ఆ చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం తనకేమీ తెలియదన్నట్టు నటించాడు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయంలో బయటపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బలరాంపుర్ లో జరిగింది. 

వివరాలు ఇలా ఉన్నాయి. బలరాంపుర్ లోని నోమ్ కోని ప్రాంతంలో కరణ్ సోని అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడికి భార్య, ఓ కూతురు ఉంది. అయితే రెండు నెలల క్రితం అతడి ఇంటికి తన సోదరి వచ్చింది. ఆమెకు ఏడేళ్ల షియా అనే కూతురు ఉంది. అప్పటి నుంచి పలు వారిద్దరూ కరణ్ సోని కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. 

Latest Videos

కాగా.. షియా.. కరణ్ సోని కూతురు కలిసి ఆడుకునేవారు. ఈ క్రమంలో అందరి  పిల్లల్లాగే వారిద్దరూ కొట్టుకునేవారు, తిట్టుకునేవారు. ఈ విషయాన్ని పలుమార్లు కరణ్ సోని గమనించాడు. షియా తరచూ తన కూతురును కొడుతోందని భావించాడు. ఈ విషయంలో కరణ్ కు కోపం వచ్చింది. దీంతో ఆమెను అంతం చేయాలని భావించాడు. 

ఇటీవల షియా షియా ఆరుబయట ఆడుకుంటూ కనిపించింది. ఇదే మంచి సమయం అని భావించిన కరణ్.. తన వెంట వాకింగ్ కు రావాలని  మేనకోడలికి సూచించాడు. ఎలాంటి అనుమనమూ లేకుండా ఆమె కరణ్ వెంట వెళ్లింది. అలాగే ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. తరువాత డెడ్ బాడీని బాలగంజ్ సమీపంలో ఉన్న చెరువులో పడేశాడు. తరువాత ఏమీ తెలియనట్టు ఇంటికి  వచ్చాడు. 

కూతురు కనిపించలేదని షియా తల్లి ఆందోళన చెందింది. అందరితో పాటు షియా కోసం కరణ్ గాలించాడు. మరుసటి రోజు షియా డెడ్ బాడీ చెరువులో లభ్యం అయ్యింది. అయితే కరణ్ ప్రవర్తన వింతగా ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించాడు. దీంతో అతడు నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!