దారుణం.. పశువులను తరలిస్తున్న వ్యక్తిని కొట్టి చంపిన గోరక్షకులు..

Published : Jun 14, 2023, 04:39 PM IST
దారుణం.. పశువులను తరలిస్తున్న వ్యక్తిని కొట్టి చంపిన గోరక్షకులు..

సారాంశం

మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. పశువులను తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మితవాద సంస్థకు చెందిన గుంపు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పశువులను తరలిస్తున్న 23 ఏళ్ల వ్యక్తిని గోరక్షకుల బృందం కొట్టి చంపిందని, ఈ ఘటనలో ఆరుగురిని అరెస్టు చేశామని పోలీసులు బుధవారం తెలిపారు. ఈ కేసులో మరింత మంది నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. నిందితులంతా రాష్ట్రీయ భజరంగ్ దళ్ అనే మితవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పారు.

గుజరాత్ తీర ప్రాంతంలో బీభత్సం సృష్టించనున్న బిపార్ణోయ్ తుఫాను - భారత వాతావరణ శాఖ హెచ్చరిక

జూన్ 10న ఇగత్పురి ప్రాంతంలోని ఘటాన్దేవి వద్ద లోయలో లుక్మాన్ అన్సారీ మృతదేహం లభ్యం కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం ప్రకారం.. జూన్ 8న అన్సారీ తన ఇద్దరు అనుచరులతో కలిసి టెంపోలో పశువులను తరలిస్తున్నాడు. అయితే థానే జిల్లా సహపూర్ లోని విహిగావ్ వద్ద సుమారు 10-15 మంది రాష్ట్రీయ భజరంగ్ దళ్ సభ్యులు వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత టెంపోను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నాలుగు పశువులను రక్షించి వాహనాన్ని ఇగత్ పురిలోని ఘటాన్ దేవి వైపు తీసుకెళ్లారు.

ట్విట్టర్ లో చరిత్ర సృష్టించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. 25 మిలియన్లు దాటిన ఫాలోవర్ల సంఖ్య

ఓ నిర్మానుష్య ప్రదేశంలో టెంపోను ఆపి ముగ్గురిపై దాడికి దిగారు. అయితే ఇందులో అనుచరులు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయినప్పటికీ అన్సారీ తప్పించుకోలేకపోయాడని అధికారులు తెలిపారు. అన్సారీ లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడని నిందితులు చెబుతున్నప్పటికీ కొట్టడం వల్లే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద రెండు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్