24 గంటలు అందుబాటులో ఫ్రెష్ ఇడ్లీలు.. బెంగళూరులో ఏటీఎం మెషీన్ (వీడియో)

Published : Oct 15, 2022, 08:21 PM IST
24 గంటలు అందుబాటులో ఫ్రెష్ ఇడ్లీలు.. బెంగళూరులో ఏటీఎం మెషీన్ (వీడియో)

సారాంశం

బెంగళూరులో ఓ ఏటీఎం వెలిసింది. ఆ ఏటీఎం 24 గంటలపాటు ఇడ్లీలను అందించే ఏటీఎం. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  

న్యూఢిల్లీ: ఇడ్లీలకు అభిమానులు చాలా మందే ఉంటారు. ఉదయం లేవగానే ఫ్రెష్ ఇడ్లీలతో రోజు మొదలు పెట్టేవారు కోకొల్లలు. చాలా హోటల్స్‌లో ఫ్రెష్ ఇడ్లీలు ఉదయమే లభిస్తాయి. ఉదయమే కాదు.. ఏ సమయంలోనైనా ఫ్రెష్ ఇడ్లీలు లభించే చోటు ఒకటి ఉన్నది. బెంగళూరులో ఫ్రెష్ ఇడ్లీల కోసం ఏకంగా ఒక ఏటీఎం వెలిసింది. 24 గంటలపాటు ఈ ఏటీఎం వేడి వేడి ఇడ్లీలను అందిస్తున్నది. 

ఈ ఫ్రెష్ ఇడ్లీల ఏటీఎం మెషీన్‌కు సంబంధించిన వీడియోను బీ పద్మనాబన్ అనే ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేశారు. ఈ వీడియోకు 4.7 లక్షల వ్యూలు వచ్చాయి. 

ఆ వీడియోలో ఏటీఎం మెషీన్ ద్వారా ఫ్రెష్ ఇడ్లీలు ఎలా ఆర్డర్ పెట్టాలనే వివరణ ఉన్నది. అంతేకాదు, ఆ ఇడ్లీలు ఎలా తాయరు అవుతున్నాయనేది కూడా స్పష్టంగా చూపించారు. కేవలం 50 సెకండ్లలోనే ఇడ్లీలను ఈ మెషీన్ తయారయ్యాయి. ఆ వీడియోలో ఒక లేడీ టిఫిన్‌ను ఆర్డర్ చేసింది. మెషీన్ ప్రాసెస్ చేసి బయటకు ప్యాక్ చేసి ఇచ్చింది. ఈ టిఫిన్ తిని చాలా రుచికరంగా ఉన్నదని తెలిపింది. ఈ ఏటీఎం ఔట్‌లెట్ షాప్ పేరు ఫ్రెషాట్ అని ఉన్నది.

ఈ టెక్నాలజీ పై ట్విట్టర్‌లో విశేష స్పందన వచ్చింది. చాలా మంది ఈ టెక్నాలజీ చూసి థ్రిల్ అయ్యారు. 24 గంటలు ఇడ్లీలు దొరకడం పై చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు. అసలు అవసరమే లేని ఓ సమస్యకు పరిష్కారం దొరికందని ఒకరు వ్యంగ్యం చేశారు. కాగా, నైట్ షిఫ్ట్ చేసే వారికి రాత్రి పూట కూడా ఆకలి అవుతుందని, ఆకలితో అలసిపోయి ఇంటికి వెళ్లుతుంటారని, వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇంకో ట్విట్టర్ యూజర్ రిప్లై ఇచ్చారు. 

మరికొందరు .. ఎక్స్ట్రా చట్నీ లేదా ఎక్స్‌ట్రా సాంబార్ కావాలంటే ఎలా అంటూ మరికొందరు కొత్త సందేహాలను తెచ్చారు.

PREV
click me!

Recommended Stories

Indian Army :ఎముకలు కొరికే చలిలో ఇండియన్ఆర్మీ కవాతు | PirPanjal Heavy Snowfall | Asianet News Telugu
First Day of 2026 at Sabarimala: నూతన సంవత్సరం శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ | Asianet News Telugu