ఐఐటీ మద్రాసులో వివక్ష.. ఫుడ్ పేరుతో..

By ramya neerukondaFirst Published Dec 15, 2018, 12:42 PM IST
Highlights

వెజ్, నాన్ వెజ్ ఫుడ్ స్టూడెంట్స్ అంటూ.. వేరే చేశారు. కాగా.. ఇప్పుడు ఈ దుమారం ఇంటర్నెట్ కి ఎక్కేసింది. క్యాంటిన్ లో వెజ్ తినే స్టూడెంట్స్ కి, నాన్ వెజ్ తినే విద్యార్థులకు వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయడం వివాదం సృష్టించింది. 

ప్రముఖ ఐఐటీ మద్రాసు క్యాంటీన్‌లో ఫుడ్ పేరుతో సామాజిక వివక్షకు తెరలేపారు.  వెజ్, నాన్ వెజ్ ఫుడ్ స్టూడెంట్స్ అంటూ.. వేరే చేశారు. కాగా.. ఇప్పుడు ఈ దుమారం ఇంటర్నెట్ కి ఎక్కేసింది. క్యాంటిన్ లో వెజ్ తినే స్టూడెంట్స్ కి, నాన్ వెజ్ తినే విద్యార్థులకు వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయడం వివాదం సృష్టించింది. 

క్యాంటీన్‌లో మాంసాహారులు, అత్యంత శాకాహారులు, శాకాహారులంటూ మూడు రకాల అంటరానితనం పాటిస్తున్నారంటూ కొందరు విద్యార్థులు ఆరోపించడం కలకలం రేపింది. దీనికి సాక్ష్యంగా కొన్ని ఫొటోలు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 
ప్యూర్‌ వెజిటేరియన్లకు అందించే ఆహార పదార్థాల్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు వాడటం లేదు. శాకాహారులకు ప్రత్యేక ప్లేట్లు, ఇతర పాత్రలు వాడుతున్నారు. మాంసాహారాలకు ప్రత్యేక వంటపాత్రలు ఉపయోగిస్తున్నారు. ఈ మూడురకాల భోజన ప్రియులు క్యాంటీన్‌లో వేర్వేరు స్థలాల్లో భోజనం చేస్తున్నారు. భోజనం వడ్డించేటప్పుడు కూడా వేరేవేరుగా వడ్డిస్తున్నారు. 

దీనిపై క్యాంపస్ అధికారులను కొందరు ప్రశ్నించగా.. క్యాంటిన్ లో అలా సేపరేటుగా బోర్డులు పెట్టినట్లు తమకు తెలియలేదన్నారు. ఒకవేళ నిజంగా అలా ఉంటే.. వాటిని తొలగిస్తామని కూడా చెప్పారు. విచిత్రం ఏమింటే.. వాషింగ్ బేషిన్ల విషయంలో కూడా వెజ్, నాన్ వెజ్ అంటూ వేరు చేయడం గమనార్హం. 

click me!