Junmoni Rabha: 'లేడీ సింగం' జున్మోని రభా మృతి... హత్యా ? ప్రమాదమా?

Published : May 16, 2023, 11:56 PM IST
Junmoni Rabha: 'లేడీ సింగం' జున్మోని రభా మృతి... హత్యా ? ప్రమాదమా?

సారాంశం

Junmoni Rabha: అస్సాంకు చెందిన 'లేడీ సింగం' జున్మోని రభా రోడ్డుప్రమాదంలో మరణించారు. ఇది ప్రమాదం కాదనీ, హత్యనేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె మృతి వెనుక నిజానిజాలు తేల్చేందుకు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Junmoni Rabha:అస్సాం లేడీ సింగంగా గుర్తింపు తెచ్చుకున్న అస్సాం మహిళా సబ్ ఇన్పెక్టర్ జున్మోని రభా మంగళవారం (మే 16) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. నాగావ్ జిల్లాలోని జఖలబంధ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరుభుగియా గ్రామంలో మహిళా పోలీసు అధికారి కారును  కంటైనర్ ట్రక్కు ఢీకొట్టడంతో ఆమె మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. 
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 'లేడీ సింఘమ్' లేదా 'దబాంగ్ కాప్'గా ప్రసిద్ధి చెందిన జున్మోని రభా యూనిఫాం లేకుండా తన ప్రైవేట్ కారులో ఒంటరిగా ప్రయాణిస్తోందని పోలీసు అధికారులు తెలిపారు. కలియాబోర్ సబ్ డివిజన్‌లోని జఖలబంధ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరుభుగియా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.

జున్మోని రాభా మోరికోలాంగ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. నేరస్థులపై కఠినమైన చర్యలు తీసుకునేవారు. తెల్లవారుజామున 2.30 గంటలకు సమాచారం అందుకున్న పోలీసు పెట్రోలింగ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. జున్మోని రభాను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ విషయాన్ని జఖ్లబంధ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి పవన్ కలిత తెలిపారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ ట్రక్కును పోలీసులు సీజ్ చేసినట్లు ఇన్‌ఛార్జ్ పవన్ కలిత తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. నాగావ్ పోలీస్ సూపరింటెండెంట్ లీనా డోల్ ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

సీఐడీ విచారణ 

జున్మోని రభా ప్రమాదంపై సిఐడి దర్యాప్తు చేయనుంది. ఇది కాకుండా.. ప్రమాదానికి కొన్ని గంటల ముందు రభాపై దోపిడీ కేసు నమోదైంది. అదే సమయంలో కుట్ర అనుమానం వ్యక్తం చేస్తూ, రభా కుటుంబం ప్రమాదంపై నిష్పక్షపాత విచారణను డిమాండ్ చేసింది. జున్మోని రభా మృతి వెనుక నిజానిజాలు వెలికితీసేందుకు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆమె తల్లి సుమిత్రా రభా మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఎవరో గుర్తుతెలియని రాకెట్‌తో ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య అని ఆరోపించారు.

సెక్యూరిటీ లేకుండా ప్రైవేట్ కారులో ఎందుకు వెళ్లారు?

అయితే, మహిళా పోలీసు అధికారిణి జున్మోని రభా ఎలాంటి భద్రత లేకుండా.. సాధారణ దుస్తులలో తన ప్రైవేట్ కారులో ఎగువ అస్సాం వైపు ఒంటరిగా ఎందుకు వెళ్తున్నారనే దానిపై పోలీసులకు సమాచారం లేదు. అదే సమయంలో ఆమె కుటుంబానికి కూడా ఈ పర్యటన గురించి సమాచారం లేదు.

అవినీతి ఆరోపణలపై అరెస్టు 

గత ఏడాది జూన్‌లో రభాను అవినీతి ఆరోపణలపై ఆమె మాజీ ప్రియుడితో పాటు అరెస్టు చేసి, మజులి జిల్లాలోని కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆ తర్వాత అతని సర్వీసు సస్పెండ్ చేయబడింది. ఆ తర్వాత ఆమె సస్పెన్షన్‌ను రద్దు చేయడంతో మళ్లీ పోలీసు సర్వీస్‌లో చేరారు. గత ఏడాది జనవరిలో బిహ్‌పురియా నియోజకవర్గం నుండి బిజెపి ఎమ్మెల్యే అమియా కుమార్ భుయిన్యాతో ఆమె టెలిఫోన్ సంభాషణ లీక్ కావడంతో ఆమె కూడా వివాదంలో చిక్కుకుంది.

PREV
click me!

Recommended Stories

ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!
Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu