MOOD OF THE NATION SURVEY 2024 : లోక్ సభ ఎన్నికలు 2024లో గెలుపెవరిదో మీరే చెప్పండి..?  

By Arun Kumar P  |  First Published Mar 13, 2024, 4:22 PM IST

రేపో మాపో లోక్ సభ ఎలక్షన్ షెడ్యూల్ వెలువడేలా వుంది. రాజకీయ పార్టీలన్ని ఇప్పటికే ఎన్నికల కదనరంగంలోకి దిగి తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నికల హంగామా సాగినవేళ ప్రజల మూడ్ ఎలా తెలుసుకునేందుకు ఏషియానెట్ తెలుగు ఆసక్తికర సర్వే చేపట్టింది. 


న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల హడావిడి నెలకొంది. ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించనేలేదు ప్రధాన పార్టీలన్నీ ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచార సన్నాహాలతో రాజకీయ పార్టీలన్నీ బిజీబిజీ అయిపోయాయి. ప్రతి పార్టీ గెలుపు తమదేనన్న ధీమాతో వున్నాయి. కానీ ప్రజల మూడ్ ఎలా వుందో ఎవరికీ అర్థంకావడంలేదు. అందుకోసమే ఏషియా నెట్ న్యూస్ ప్రజల నాడి తెలుసుకునేందుకు ప్రత్యేక సర్వే చేపట్టింది. 'మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే 2024' పేరిట ఏ పార్టీకి ప్రజా మద్దతు వుందో తెలుసుకునేందుకు సర్వే చేపట్టాం. ఈ సర్వేలో మీరూ పాల్గొని అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు.... మా ప్రశ్నలకు మీ సమాధానం చెప్పండి. 

లోక్ సభ ఎన్నికలు 2024 కు ముందు భారత ప్రజలను ప్రభావితం చేసే చర్యలను చేపట్టింది బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.  అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట, పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు లాంటివి ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజల అభిప్రాయం కూడా ఇదేనా? ప్రతిపక్షాల వాదనతో ఏకిభవిస్తారా లేక మోదీ సర్కార్ చర్యలను సమర్ధిస్తారా? అన్నది ఏషియా నెట్ సర్వే రిజల్ట్ బయటపెడుతుంది. 

Latest Videos

గల్వాన్ ఘటనలో చైనాతో... అలాగే దాయాది దేశాలు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్తాన్ తో మోదీ వ్యవహార తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చ పాజిటివ్ గా జరుగుతుందా లేక నెగెటివ్ గానా అన్నది ఏషియా నెట్ సర్వే తేల్చనుంది. 

2024 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని బిజెపి చెబుతోంది. ఈ విషయంలో ప్రతిపక్షాల ఇండియా(INDIA) కూటమి ఎటూ తేల్చుకోలేకపోతోంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, జాతీయాధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో పాటు మరికొందరు నేతల పేర్లు ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వస్తున్నాయి. వీరిలో మీరయితే ఎవరిని ప్రధానిగా కోరుకుంటున్నారో ఏషియానెట్ చేపట్టిన సర్వేలో పాల్గొని తెలపండి.  

ఇక గత పదేళ్లుగా మోదీ సర్కార్ హయాంలో జరిగిన అభివృద్ది, ప్రజాసంక్షేమం, తీసుకువచ్చిన సంస్కరణలు ఎలా వున్నాయి... గెలిపించే ప్రధాన అస్త్రమేదో మీరే తేల్చండి. ఇక ఈసారి కాంగ్రెస్ సత్తా చాటుతుందా... రాహుల్ జోడో యాత్రలు ప్రభావం ఎంత?  అనే ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పాలి. మొత్తంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పలు ప్రశ్నలను సంధించి ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏషియానెట్ న్యూస్ తెలుగు. దీంట్లో మీరుకూడా పాల్గోని మీ అభిప్రాయాలను పంచుకొండి.

 ఈ కింది లింక్ పై క్లిక్ చేసి సర్వేలో పాల్గొనండి... 

 https://telugu.asianetnews.com/mood-of-the-nation-survey

 

click me!