ఏషియానెట్ న్యూస్ సర్వే: వచ్చే యూపీ ఎన్నికల్లో రామమందిరం ప్రభావం ఎంత?

By team teluguFirst Published Aug 18, 2021, 5:18 PM IST
Highlights

రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రామమందిరం ఎలాంటి ప్రభావాన్ని చూపెట్టబోతుందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఏషియానెట్ న్యూస్ మూడ్ ఆఫ్ ఓటర్స్ సర్వే నిర్వహించింది. 

దేశంలో రాజకీయంగా అత్యంత ముఖ్యమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు మరో 7 నెలల సమయం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఓటర్లు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ వోటేయబోతున్నారు, ఏయే అంశాలు వారి వోటింగ్ ని ప్రభావితం చేయనుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏషియానెట్ న్యూస్. 

మూడ్ ఆఫ్ ది ఓటర్ సర్వే ని ఉత్తరప్రదేశ్ లో జన్ కి బాత్ సంస్థతో చేపించి ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

దేశంలోనే రాజకీయాల గతులను మార్చిన రామమందిర నిర్మాణం ప్రస్తుతం అయోధ్యలో జరుగుతుంది. మోడీ సర్కార్ సాధించిన అద్భుత విజయంగా బీజేపీ నేతలు దీన్ని వర్ణించడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రామమందిరం ఎలాంటి ప్రభావం చూపుతుందని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఈ సర్వే. 

"

ఎన్నికల్లో రామమందిరం  అంశం ఎంత మేర ప్రభావం చూపుతుందనే ప్రశ్నకి అతి ముఖ్యమైన ఎన్నికల అంశం అని 33 శాతం మంది ప్రజలు చెప్పగా... 22 శాతం మంది సాధారణ అంశం అని పేర్కొన్నారు. 32 శాతం మంది తక్కువ ప్రాధాన్యత గల అంశం అనగా... 13 శాతం మంది అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం అని చెప్పారు. 

ప్రాంతాల వారీగా గనుక చూసుకుంటే... గోరఖ్ ప్రాంతంలో 25 శాతం మంది అత్యధిక ప్రాధాన్యమైన అంశం అని పేర్కొనగా... 10 శాతం మంది సాధారణ అంశం అని తెలిపారు. 32 శాతం మంది తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం అనగా... 28 శాతం మంది అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం అని అన్నారు. 

ఇక బ్రిజ్ ప్రాంతానికి వస్తే... 38 శాతం మంది అత్యధిక ప్రాధాన్యమైన అంశం అని పేర్కొనగా... 11 శాతం మంది సాధారణ అంశం అని తెలిపారు. 41 శాతం మంది తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం అనగా... 6 శాతం మంది అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం అని అన్నారు. 

పశ్చిమ యూపీలో 14 శాతం మంది అత్యధిక ప్రాధాన్యమైన అంశం అని పేర్కొనగా... 3 శాతం మంది సాధారణ అంశం అని తెలిపారు. 64 శాతం మంది తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం అనగా... 17 శాతం మంది అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం అని అన్నారు.

Also read: ఏషియానెట్ న్యూస్ సర్వే: యూపీలో విజేతను నిర్ణయించేది కుల సమీకరణలే....

అవధ్ ప్రాంతంలో గనుక చూసుకుంటే...  30 శాతం మంది అత్యధిక ప్రాధాన్యమైన అంశం అని పేర్కొనగా... 10 శాతం మంది సాధారణ అంశం అని తెలిపారు. 45 శాతం మంది తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం అనగా... 15 శాతం మంది అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం అని అన్నారు.

ఇక కాశీ ఏరియాలో.... 30 శాతం మంది అత్యధిక ప్రాధాన్యమైన అంశం అని పేర్కొనగా... 19 శాతం మంది సాధారణ అంశం అని తెలిపారు. 33 శాతం మంది తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం అనగా... 15 శాతం మంది అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం అని అన్నారు.

కాన్పూర్ బుందేల్ ఖండ్ ప్రాంతాల్లో... 50 శాతం మంది అత్యధిక ప్రాధాన్యమైన అంశం అని పేర్కొనగా... 25 శాతం మంది సాధారణ అంశం అని తెలిపారు. 22 శాతం మంది తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం అనగా... 21 శాతం మంది అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం అని అన్నారు.

Also Read: ఏషియానెట్ న్యూస్ సర్వే: తదుపరి ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరు?

ఉత్తరప్రదేశ్ లోని 6 భౌగోళిక ముఖ్య ప్రాంతాలైన కాన్పూర్ బుందేల్ ఖండ్, అవధ్, పశ్చిమ యూపీ, కాశి, బ్రిజ్, గోరఖ్ ప్రాంతాల్లో 4200 మంది ఓటర్లను శాంపిల్ తో ఈ ఒపీనియన్ సర్వేని నిర్వహించడం జరిగింది. రాండమ్ శాంప్లింగ్ ద్వారా వన్ ఆన్ వన్ ఇంట్రాక్షన్స్ తో ప్రాబబిలిటీ మ్యాపింగ్ ద్వారా ఈ సర్వే చేయడం జరిగింది.

click me!