ఏసియానెట్ మరో మైలురాయి ... మలయాళం ఇన్‌స్టాకు 2 మిలియన్ ఫాలోవర్స్

By Arun Kumar P  |  First Published Jan 15, 2025, 10:57 AM IST

ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్ ఫాలోవర్స్‌తో ఏసియానెట్ న్యూస్ సరికొత్త రికార్డ్ సృష్టించింది.  


Asianet News New Record : మీడియా రంగంలో ఏసియానెట్  గ్రూప్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, తమిళ్, మరాఠీ, కన్నడ, బెంగాలీ భాషలో వేగంగానే కాదు తమదైన శైలిలో వార్తలను అందిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో ఏసియా నెట్ ను అభిమానించేవారు రోజురోజుకు పెరుగుతున్నారు. ఏసియా నెట్ కు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ వుందో తాజాగా మలయాళ ఛానల్ తాజాగా సాధించిన రికార్డ్ ను బట్టి అర్థమవుతుంది. 

ఏసియా నెట్ మలయాళం ఛానల్ ఇన్‌స్టాగ్రామ్‌ 2 మిలియన్ ఫాలోవర్స్‌  కు చేరుకుంది. ఇలా అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగివున్న మొదటి మలయాళ వార్తా సంస్థగా నిలిచింది. యువతరానికి ఇష్టమైన సోషల్ మీడియాలో ఏసియా నెట్ కు ఎంత ఆదరణ వుంది. అందువల్లే ఇంత వేగవంతమైన వృద్ధి సాధ్యమయ్యింది. ఇది డిజిటల్ మీడియా రంగంలో ఏసియానెట్ కు పెరుగుతున్న ప్రజాదరణను హైలైట్ చేస్తుంది.

Latest Videos

ఏసియానెట్ న్యూస్ ఫిబ్రవరి 2015లో ఇన్‌స్టాగ్రామ్‌లో అరంగేట్రం చేసింది. 2023 చివరి నాటికి ఇది 1 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన మలయాళ డిజిటల్ మీడియా సంస్థగా అవతరించింది. అప్పటి నుండి దీని వృద్ధి వేగంగా సాగింది... చాలా తక్కువ కాలంలోనే 2 మిలియన్ ఫాలోవర్స్ మైలురాయిని చేరుకుంది.

ఇక చాలా సంవత్సరాలుగా రేటింగ్ లోనూ పోటీ వార్తా ఛానెళ్లను అధిగమిస్తూ వస్తోంది ఏసియా నెట్. డిజిటల్ రంగంలో అసలు ఎదురన్నదే లేకుండా ప్రయాణం సాగిస్తోంది. ఈ  డిజిటల్ ప్రపంచంలో మలయాళ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా చాలా దగ్గరయ్యింది ఏసియానెట్. ఈ విషయాన్ని కింది ఢాటా తెలియజేస్తుంది. 

యూట్యూబ్‌లో ఏసియానెట్ న్యూస్‌కు 10.4 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లు, ఫేస్‌బుక్‌లో 6.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. థ్రెడ్స్‌లో 250,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్, X ప్లాట్‌ఫారమ్‌లో 700,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. చాలా సంవత్సరాలుగా మలయాళ వార్తా సంస్థలలో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఏసియానెట్ న్యూస్ అగ్రస్థానంలో ఉంది.

ఏసియా నెట్  తెలుగు ఇన్స్టాగ్రామ్ కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి 

https://www.instagram.com/asianetnews.telugu/?hl=en

click me!