ఏషియా నెట్ న్యూస్ - సీఫోర్ సర్వే: పుదుచ్చేరిలో బీజేపీ కూటమిదే అధికారం

By team teluguFirst Published Mar 16, 2021, 10:20 PM IST
Highlights

రానున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే - బీజేపీ- రంగస్వామి కాంగ్రెస్ ల కూటమి అక్కడ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఏషియా నెట్ న్యూస్ - సీఫోర్ సర్వే పేర్కొంది.

పుదుచ్చేరి లో అనేక నాటకీయ పరిణామాల మధ్య అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ కి ఇప్పుడు తాజాగా మరో ఎదురుదెబ్బ తగలనుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పుదుచ్చేరిలో అన్నాడీఎంకే - బీజేపీ- రంగస్వామి కాంగ్రెస్ ల కూటమి అక్కడ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఏషియా నెట్ న్యూస్ - సీఫోర్ సర్వే పేర్కొంది. 

మార్చి 5 నుండి 12 వ తేదీల మధ్య పుదుచ్చేరి లోని 30 నియోజకవర్గాల్లో 5077 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించి రాండమ్ శాంప్లింగ్ పద్ధతి ద్వారా నిర్వహించిన ఈ సర్వే కాంగ్రెస్ పార్టీకి భారీ ఓటమి తప్పదని తేల్చింది. 2016 ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే, రంగస్వామి కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయగా... ఈ దఫా ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. 

ఈ సర్వే ప్రకారం ఈ మూడు పార్టీలు మొత్తం 30 నియోజకవర్గాలకు గాను 23 నుంచి 27 సీట్లను గెలుచుకోగలవని తెలిపింది. దాదాపు 52 శాతం ఓట్ల శాతంతో తో ఈ కూటమి అధికారాన్ని చేజిక్కుంచుకుంటుందని అంచనా వేసింది. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ డీఎంకే ల కూటమి 39 ఓట్ల శాతాన్ని సాధించగా... ఈసారి అది 36 శాతానికి పడిపోతుందని ఈ సర్వే పేర్కొంది. 

52 శాతం మంది ప్రజలు బీజేపీ- అన్నాడీఎంకే - రంగస్వామి కాంగ్రెస్ ల కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పేర్కొనగా, 33 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ - డీఎంకే ల కూటమి వైపు మొగ్గు చూపారు. అంతేకాకుండా 44 శాతం మంది ప్రజలు నారాయణస్వామి ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయగా, 33 శాతం మంది పాలన మోస్తరుగా ఉందని పేర్కొన్నారు. 22 శాతం మంది మాత్రం కాంగ్రెస్ పాలన చాలా బాగుందని తమ అభిప్రాయాన్ని తెలిపారు. 

ఈ సర్వేలో ఇవి మాత్రమే కాకుండా అనేక ఆసక్తికర అంశాలు కూడా వెలువడ్డాయి. నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం పుదుచ్చేరిని గత కాంగ్రెస్ డీఎంకే ల కూటమి కన్నా చక్కగా పరిపాలించగలుగుతుందని పేర్కొనగా... మాజీ ముఖ్యమంత్రి రంగస్వామికి ఊరట కలిగిస్తూ 37 శాతం మంది మాత్రం దాన్ని వ్యతిరేకరించారు. 

42 శాతం మంది ప్రజలు సీఎం అభ్యర్థిని బట్టి తమ ఓటు వేస్తామని తెలుపగా, 22 శాతం మంది పార్టీ సిద్ధాంతాల ఆధారంగా ఓటు వేస్తామని తెలిపారు. 15 శాతం మంది ఎమ్మెల్యే పనితీరు ఆధారంగా ఓటు వేస్తామనగా మరో 4 శాతం మంది కులం ప్రాతిపదికన ఓటు వేయనున్నట్టు తెలిపారు. 

పుదుచ్చేరి కి ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని కేంద్ర నాయకత్వం అవసరమైనప్పుడల్లా సహకారం అందించిందా అనే విషయంలో 39 శాతం మంది తోడ్పాటు అందించింది అని పేర్కొనగా... 34 శాతం మంది మాత్రం ఈ అభిప్రాయంతో విభేదించారు. 

ప్రజా సమస్యల విషయానికి వస్తే 22 శాతం మంది రేషన్ షాపులు అందుబాటులో ఉండడం లేవని పేర్కొనగా, 20 శాతం మంది మురికి కాల్వల సమస్యను ఎత్తిచూపారు. 17 శాతం మంది రోడ్లు బాగోలేవని పేర్కొనగా, మరో 13 శాతం మంది నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. మరో 10 శాతం మంది మంచినీటి లభ్యత గురించి పెదవి విరిచారు. 

click me!