ఏసియానెట్ న్యూస్‌కి 30 ఏళ్లు

Published : Sep 30, 2024, 11:50 AM ISTUpdated : Sep 30, 2024, 12:00 PM IST
ఏసియానెట్ న్యూస్‌కి 30 ఏళ్లు

సారాంశం

వార్తా ఛానల్ ఏసియాా నెట్ న్యూస్ మరో మైలురాయికి చేరుకుంది. మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏసియా నెట్ ప్రస్థానం ప్రస్థానం సరిగ్గా 30 ఏళ్ల  ప్రారంభమయ్యింది.  1993 లో ప్రారంభించిన ఈ ఛానల్ విజయవంతంగా కొనసాగుతోంది. 

నిజాలకు ప్రజలముందు వుంచడంతో ఏసియానెట్ న్యూస్ ఎప్పుడూ ముందుంటుంది. అందువల్లే కేరళ ప్రజలకు ఈ ఛానల్ చాలా దగ్గరయ్యింది...  ప్రస్తుతం మళయాళ మీడియా రంగంలో ఈ ఛానల్ దే హవా. ఇలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ మలయాళ వార్తా ఛానల్ మీడియా రంగంలో అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తయ్యింది. దీంతో ప్రత్యేక వేడుకలకు సిద్దమయ్యంది ఏసియా నెట్ సంస్థ... ఈ ఏడాది పొడవునా వేడుకను ప్లాన్ చేసింది. 

1993లో ప్రారంభమై మలయాళీ సమాజం యొక్క అభిరుచిని ఏసియా నెట్ న్యూస్ సాకారం చేస్తుంది. సామాజిక బాధ్యత, జర్నలిజం విలువలతో వార్తలు అందిస్తూ ప్రజలకు దగ్గరయ్యింది. ఈ ఛానల్ ను కేరళ మాజీ ముఖ్యమంత్రి కె. కరుణాకరన్ ప్రారంభించగా, కె.ఆర్. నారాయణన్ స్టూడియోను ప్రారంభించారు. ఆసక్తికర కథనాలు, సమాజానికి ఉపయోగపడే వార్తలతో అతి తక్కువ కాలంలోనే ఏసియానెట్ న్యూస్ మంచి గుర్తింపు పొందింది.   

సమాజంలోని అట్టడుగు వర్గాలకు అండగా నిలుస్తోంది ఏసియా నెట్ న్యూస్. అలాగే దేశంలో ఏ మూలన ఏ ఘటన జరిగినా క్షణాల్లో ప్రజల ముందు వుంచుతోంది. ఇలా 2001 పార్లమెంట్ దాడిలో హృదయ విదారక దృశ్యాలు, గుజరాత్ భూకంప సమయంలో ఫీల్డ్ రిపోర్టింగ్, 2004 సునామీ సమయంలో ప్రత్యక్ష సాక్షుల నుండి సమాచారం, కార్గిల్ యుద్ధ వేళ   ధైర్యంగా రిపోర్టింగ్ ... ఇలా ఎన్నో అద్భుతమైన కథనాలను ప్రసారం చేసింది. ఇలా సరికొత్త బాటలో నడుస్తూ ఎసియా నెట్ న్యూస్ మీడియా రంగంలో ప్రత్యేకతను చాటుకుంది. 

 ఏసియానెట్ న్యూస్ దేశ సంఘటనలను ప్రతిబింబించే అద్దంలా ఉంది. 1996 అసెంబ్లీ ఎన్నికల రియల్-టైమ్ రిపోర్టింగ్ ద్వారా మలయాళీలకు కొత్త అనుభవాన్ని అందించింది. మారరికుళంలో వి.ఎస్. అచ్యుతానందన్ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మరుసటి రోజు వార్తాపత్రికల ద్వారా కాకుండా ఏసియా నెట్ న్యూస్ ద్వారా తెలుసుకున్నారు మళయాళీలు. అలాగే 1998లో ఈఎంఎస్ మరణం, 2004లో ఐకె నాయనార్ అంత్యక్రియల ఊరేగింపుతో పాటు ఇతర కీలకమైన క్షణాలను ఛానల్ కవర్ చేసింది.  

ఏసియానెట్ న్యూస్ యొక్క బలం దాని 30 ఏళ్ళ అనుభవమే కాదు ప్రతిభావంతులైన జర్నలిస్టులను కలిగివుండటం కూడా. సంచలనాలకు ప్రాధాన్యత ఇచ్చే ఈ యుగపు మీడియాకు ఏసియానెట్ న్యూస్ భిన్నంగా నిజానిజాలు తెలుసుకున్నాకే కథనాలను ప్రసారం చేస్తోంది. అందువల్లే ఈ ఛానల్ మలయాళ మీడియా పరిశ్రమకు నాయకత్వం వహిస్తుంది. వార్తలకు మించి ప్రజలు ప్రేరణ పొందేలా వినూత్న కంటెంట్ అందిస్తోంది. ఇలా సామాజికంగా బాధ్యతాయుతమైన కథనాలను అందించడమే  లక్ష్యంగా పెట్టుకున్న ఏసియా నెట్ న్యూస్ 30 ఏళ్ళ ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది.

 

.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Business Idea : మీకు సొంత పొలం ఉంటే చాలు.. రూ.10 లక్షలు సంపాదించే సూపర్ వ్యాపారం
బ్లాక్ టైగర్, ప్రపంచానికి తెలియని గూఢచారి.. రవీంద్ర కౌశిక్ గురించి తెలిస్తే గూజ్‌బంప్స్ రావాల్సిందే