సర్వీస్ రివాల్వర్ తో భార్య, కొడుకు, పెంపుడు కుక్కలను హతమార్చిన ఏఎస్ఐ.. చూసిందని యువతి కిడ్నాప్.. ఆ తరువాత...

Published : Apr 05, 2023, 10:47 AM IST
సర్వీస్ రివాల్వర్ తో భార్య, కొడుకు, పెంపుడు కుక్కలను హతమార్చిన ఏఎస్ఐ..  చూసిందని యువతి కిడ్నాప్.. ఆ తరువాత...

సారాంశం

గురుదాస్‌పూర్ ఏఎస్ఐ భూపీందర్ సింగ్ తన భార్య బల్జీత్ కౌర్, కుమారుడు లవ్‌ప్రీత్ సింగ్ లను తన సర్వీస్ రివాల్వర్ తో హత్య చేసి.. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. 

పంజాబ్ : పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒకరు మంగళవారం తన సర్వీస్ ఆయుధంతో తన భార్య, కొడుకు పెంపుడు కుక్కను కాల్చి చంపాడు. అమృత్‌సర్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ భూపీందర్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్ తో భార్య బల్జీత్ కౌర్ (40), కుమారుడు లవ్‌ప్రీత్ సింగ్ (19)లను హత్య చేశాడు. తమ పెంపుడు కుక్కను కూడా కాల్చి చంపి.. అక్కడినుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. కొన్ని గంటల తర్వాత, నిందితుడైన ఆ పోలీసు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

అయితే, సింగ్ తన భార్య, కొడుకును ఎందుకు చంపడానేది తెలియరాలేదు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గురుదాస్‌పూర్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్య, కొడుకు, కుక్కను చంపిన తరువాత నిందితుడు బుబ్లి గ్రామానికి చెందిన ఓ యువతిని కిడ్నాప్ చేశాడు. ఆమె అతను నేరం చేయడాన్ని చూసినట్లు తెలిసింది. విషయం తెలియడంతో పోలీసులు బాలికను సురక్షితంగా రక్షించారు. వైద్య పరీక్షల కోసం ఆమెను సివిల్ ఆసుపత్రికి తరలించారు.

భార్యను చంపి, మృతదేహాన్ని గోనె సంచిలో ఇటుకలతో నింపి, యమునా నదిలో విసిరేసి.. ఓ భర్త దారుణం..

ఇండియా టుడేతో మాట్లాడుతున్నప్పుడు, గురుదాస్‌పూర్ ఎస్‌ఎస్‌పి హరీష్ కుమార్ దయామా మాట్లాడుతూ, నిందితుడైన పోలీసు అధికారిని పట్టుకోవడానికి ఒక బృందాన్ని నియమించామని చెప్పారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఓ సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. 

తన భార్య , కొడుకును హత్య చేసిన అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నేరం చేసిన తర్వాత గురుదాస్‌పూర్‌లోని భుంబ్లీ గ్రామంలోని తన ఇంటి నుండి బయటికి వెళ్లడాన్ని ఆ సీసీ ఫుటేజ్ లో చూపిస్తోంది. ఏఎస్ ఐ భూపీందర్ సింగ్ తన సర్వీస్ ఆయుధాన్ని పట్టుకుని తన నివాసం నుండి బయటకు వస్తున్న ఈ వీడియో ఇప్పుడు కలకలం రేపుతుంది. అయితే, ఈ హత్యల తరువాత కిడ్నాప్ కు కూడా పాల్పడి బీభత్సం సృష్టించిన అతను ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు.

అతని చేతిలో ఉన్న అదే ఆయుధాన్ని ఉపయోగించి, భార్య బల్జీత్ కౌర్ (40), కుమారుడు లవ్‌ప్రీత్ సింగ్ (19)లను అంతకుముందు రోజు హత్య చేశాడు. అమృత్‌సర్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్న సింగ్ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో భుంబ్లీ గ్రామంలో తన భార్య, కుమారుడు,  పెంపుడు కుక్కను కాల్చిచంపాడు. కొన్ని గంటల తర్వాత, నిందితుడు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో హత్యలు చేయడం చూసిన తమ గ్రామానికి చెందిన ఓ యువతిని అతను కిడ్నాప్ చేశాడు. విషయం తెలియడంతో రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల తరువాత ఆ యువతిని రక్షించారు. కాగా దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ కూడా వెలుగు చూసింది. అందులో ఏఎస్ఐ ఆ యువతిని బంధించి.. ఇంట్లోకి తీసుకెలుతుండడం కనిపిస్తుంది.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?