
బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్‌లపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులకు ప్రగతిశీల ఆలోచనలు లేవని, వారికి ఎప్పుడూ సంప్రదాయవాద ఆలోచనే ఉంటుందని అశోక్ గెహ్లాట్ అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీల ఉద్దేశం దేశానికి చాలా ప్రమాదకరమనీ, ఈ ఉద్దేశాన్నిఅర్థం చేసుకోకపోతే.. భవిష్యత్తు తరాలు తీవ్రంగా నష్టపోతాయని అన్నారు. రష్యా, చైనా తరహాలో దేశంలో ఫేక్ ఎన్నికలు జరుగుతాయనీ, అలా అయితే.. దేశంలో ఒకే పార్టీ ఉంటుందని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తూ డ్రామాలు చేస్తారనీ, మళ్లీ మళ్లీ ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందనీ , కాంగ్రెస్ నేతలు త్యాగాలు చేసి దేశ ప్రజాస్వామ్యాన్ని బతికించారని అశోక్ గెహ్లాట్ అన్నారు.
బీజేపీపై గెహ్లాట్ దాడి
బికనీర్‌లోని జస్రాసర్‌లో జరిగిన కిసాన్ సమ్మేళన్‌లో గెహ్లాట్ మాట్లాడుతూ.. “దేశంలో కంప్యూటర్ విప్లవం తీసుకురావాలని రాజీవ్‌గాంధీ భావించినప్పుడు.. జనసంఘ్ వాసులు రాజీవ్‌గాంధీని పిచ్చిగా చిత్రీకరించాయని, కంప్యూటర్‌లు వస్తే టైపిస్టులు ఎక్కడికి వెళ్తారని, ప్రజల ఉపాధిని లాక్కొంటారని విమర్శించారని గుర్తు చేశారు. అలాగే.. పండిట్ నెహ్రూకు మతి పోయిందని, భాక్రా డ్యామ్ కట్టాడమేంటీ..? ఆ డ్యాం ద్వారా కరెంటు ఉత్పత్తి చేయడమేంటనీ ఎద్దేవా చేశారని అన్నారు
బీజేపీ అనాలోచిత నిర్ణయాలను తీసుకుంటుందనీ, రైతులపై నల్లచట్టాలను ప్రయోగించాలని ప్రయత్నించిందని, నల్లచట్టాల వ్యతిరేక ఉద్యమంలో 700 మంది రైతులు చనిపోయారనీ, వారికి రైతుల గురించి ఆలోచించే మనస్సు లేదని అన్నారు.ముందే రైతులతో మాట్లాడి ఉండే.. ఇంతమంది రైతులు చనిపోయి ఉండేవారు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనీ, దేశం ఏ దిశలో వెళుతుందో ఎవరికీ తెలియడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులను దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారనీ, దేశంలో విమర్శించే హక్కు ఎవరికీ లేదా? అని గెహ్లాట్ ప్రశ్నించారు.
'అదానీ అంశంపై ప్రధాని మోదీ మౌనం'
అదానీ అంశాన్ని రాహుల్ గాంధీ లేవనెత్తినప్పుడు సమాధానం చెప్పలేదని.. సమాధానం చెప్పాల్సిన అధికార పార్టీ కాదా అని సీఎం గెహ్లాట్ నిలదీశారు. మీకు నచ్చిన సమాధానం ఇవ్వండి, కానీ ఏదైనా చెప్పండి. సరియైనదా? కాదా ? తరువాత దేశంలో ప్రధాని మౌనం పాటించడం ఇదే తొలిసారని ఎద్దేవా చేశారు. నిమ్మకాయ, పాలు కలపకూడదన్న మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రకటనపై అశోక్ గెహ్లాట్ ఎదురుదాడి చేశారు. రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. వచ్చే ఎన్నికలు రాబోతున్నాయి, ప్రభుత్వం మారితే..ఆ తర్వాత పథకాలు కూడా మారుతాయని, ఆ నష్టం ప్రజలపై పడుతుందని అన్నారు.