జైలులో కోవిడ్ పాజిటివ్.. చికిత్స కోసం ఆశారాం బెయిల్ పిటిషన్

Siva Kodati |  
Published : May 11, 2021, 03:12 PM IST
జైలులో కోవిడ్ పాజిటివ్.. చికిత్స కోసం ఆశారాం బెయిల్ పిటిషన్

సారాంశం

మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి యావజ్జీర కారాగార శిక్ష పడిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూజీ రాజస్థాన్ హైకోర్టులో బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో చికిత్స చేయించుకునేందుకు తనకు బెయిలు ఇవ్వాలని ఆశారాం బాపూజీ విజ్ఞప్తి చేశారు

మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి యావజ్జీర కారాగార శిక్ష పడిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూజీ రాజస్థాన్ హైకోర్టులో బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో చికిత్స చేయించుకునేందుకు తనకు బెయిలు ఇవ్వాలని ఆశారాం బాపూజీ విజ్ఞప్తి చేశారు.

కోవిడ్ పాజిటివ్ బారిన పడిన ఆశారాం జోథ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినందున ఆయుర్వేద చికిత్స తీసుకోవాలని భావిస్తున్నట్లు తన బెయిలు పిటిషన్‌లో ఆశారాం కోరారు.

Also Read:రేప్ కేసులో జీవిత ఖైదు: తీర్పు విని ఏడ్చేసిన ఆశారాం

గత బుధవారం శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కోవడంతో ఆశారాం తొలుత మధుర దాస్ మథుర్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం శుక్రవారం ఎయిమ్స్‌కు తరలించారు. కాగా, జోథ్‌పూర్ జైలులో ఆశారాం సహా 12 మందికి కోవిడ్ పాజిటివ్‌‌గా తేలింది. ఈనెల 13న ఆశారాం బెయిలు అభ్యర్థనపై విచారణ జరగనుంది. 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?