Remarks On Prophet : యూపీ సీఎంమీద అసదుద్దీన్ ఓవైసీ ఫైర్.. హైకోర్టు న్యాయమూర్తి అయ్యారంటూ వ్యంగ్యాస్త్రాలు...

Published : Jun 13, 2022, 10:26 AM IST
Remarks On Prophet : యూపీ సీఎంమీద అసదుద్దీన్ ఓవైసీ ఫైర్.. హైకోర్టు న్యాయమూర్తి అయ్యారంటూ వ్యంగ్యాస్త్రాలు...

సారాంశం

"యుపి ముఖ్యమంత్రి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిపోయారు. అతను ఎవరినైనా దోషిగా నిర్ధారిస్తాడా? వారి ఇళ్లను కూల్చేస్తాడా?" అని ఓవైసీ ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రశ్నించారు.

కచ్ : ప్రయాగ్‌రాజ్ హింసాకాండలో ప్రధాన నిందితుడి ఇంటిని కూల్చివేయడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం మండిపడ్డారు, అతను అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలాగా ప్రవర్తిస్తున్నాడని నొక్కి చెప్పాడు. ఆయన మాట్లాడుతూ "యుపి ముఖ్యమంత్రి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఆయన ఎవరినైనా దోషిగా నిర్ధారించేస్తారా? వారి ఇళ్లను కూల్చివేస్తారా?" అని ఒవైసీ గుజరాత్‌లోని కచ్‌లో ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రశ్నించారు.

ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిడిఎ)  జూన్ 10న భారీ పోలీసుల మోహరింపు మధ్య.. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన హింసాకాండకు ప్రధాన సూత్రధారి అయిన జావేద్ మహ్మద్ అలియాస్ పంప్ ఇంటిని ఆదివారం కూల్చివేసింది. నిందితుడు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు, సామాజిక కార్యకర్త ఆఫ్రీన్ ఫాతిమా తండ్రి. గత సంవత్సరం కేంద్ర వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో ఫాతిమా భాగం పాల్గొన్నారు. ఈ వారం హింసలో ఆమె పాత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడి ఇంట్లో అక్రమ ఆయుధాలు, అభ్యంతరకర పోస్టర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కూల్చివేతకు ముందు ఆదివారం ఉదయం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. "వారింట్లో 12 బోర్ ఇల్లీగల్ పిస్టల్ లు, 315 బోర్ పిస్టల్, కాట్రిడ్జ్‌లు గౌరవనీయమైన కోర్టుకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలను చూపించే కొన్ని పత్రాలను కనుగొన్నాం" అని ప్రయాగ్‌రాజ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ కుమార్ తెలిపారు.

Remarks On Prophet: భారతీయ‌ వెబ్‌సైట్లపై సైబర్ అటాక్ .. 70 వెబ్‌సైట్లు, పోర్టల్స్‌ హ్యాక్‌

హింసాకాండకు సంబంధించి మహ్మద్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రౌండ్, మొదటి అంతస్తులలో అక్రమ నిర్మాణాన్ని పేర్కొంటూ అతని ఇంటి బయట నోటీసును అతికించిన కొన్ని గంటల తర్వాత కూల్చివేత జరిగింది. మేలో తనకు పంపిన కూల్చివేత ఆర్డర్‌కు సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని నోటీసులో పేర్కొన్నారు. నోటీసు ప్రకారం, జూన్ 9లోపు అక్రమ నిర్మాణాన్ని ధ్వంసం చేయాలని మహమ్మద్‌ను కోరారు, 

లేని పక్షంలో జూన్ 12 ఉదయం 11 గంటలలోపు ఇల్లు ఖాళీ చేయాలని అతనికి తుది నోటీసు పంపిచారు. అయితే, రాజకీయ నాయకుడి తరఫు న్యాయవాదులు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో వాదనలను ఖండించారు. అధికారులు నిబంధనలను పాటించలేదని, కూల్చివేత చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ, కూల్చివేసిన ఇంటి యజమాని మహమ్మద్ కాదని వారు చెప్పారు. ఆ ఇల్లు తన భార్య పేరు మీద ఉందని, అక్రమ నిర్మాణంపై ఎలాంటి నోటీసులు అందలేదని లాయర్లు తెలిపారు.

సస్పెండ్ చేయబడిన బిజెపి అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ప్రవక్త మహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలపై శుక్రవారం ప్రార్థనల అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నిరసనలు జరిగాయి. శనివారం, మునిసిపల్ బృందాలు, పోలీసులతో కలిసి, సహరాన్‌పూర్‌లో హింసాకాండ నిందితులలో ఇద్దరి ఇళ్లను కూల్చివేశారు, అవి అక్రమ నిర్మాణాలని వారు పేర్కొన్నారు.

జూన్ 3న ఇదే అంశంపై హింసాత్మక ఘర్షణలు, రాళ్లు రువ్వడం ఘటనలు జరిగిన కాన్పూర్‌లో కూడా కూల్చివేతలు జరిగాయి.
ఉత్తరప్రదేశ్ పోలీసులు నిరసనలు, హింసకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 300 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేశారు. వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్న వారిపై "కఠినమైన" చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ