కాల్ మాట్లాడుతుండగా పేలిన ఫోన్.. పోయిన ప్రాణం.. అసలేం జరిగిందంటే?

Published : Mar 02, 2023, 05:53 PM IST
కాల్ మాట్లాడుతుండగా పేలిన ఫోన్.. పోయిన ప్రాణం.. అసలేం జరిగిందంటే?

సారాంశం

కాల్ మాట్లాడుతుండగానే ఫోన్ పేలిపోయింది. దీంతో సదరు వ్యక్తి తల, ముఖం, ఛాతికి తీవ్ర గాయాలయ్యాయి. మాట్లాడుతున్న చోటే ఆ వ్యక్తి కూలబడి ప్రాణం వదిలిపెట్టాడు. అటు వైపు ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి అనుమానంతో అక్కడికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  

న్యూఢిల్లీ: ఫోన్‌ను చార్జింగ్ పెట్టి కాల్ మాట్లాడరాదని నిపుణులు తరుచూ హెచ్చరిస్తుంటారు. అది ప్రాణాంతకంగా మారే ముప్ప ఉంటుందని వార్నింగ్ ఇస్తుంటారు. చార్జింగ్ లేనప్పుడు.. కాల్ చాలా ముఖ్యమైనది అయినప్పుడు కొందరు తప్పక ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడుతుంటారు. కానీ, అది ప్రాణాలను తీసే ముప్పు కలిగి ఉండే చర్య. అయితే, ఇలాంటి ప్రమాదాల గురించిన విషయాలేవీ తెలియని 68 ఏళ్ల వ్యక్తి ఫోన్ చార్జింగ్ పెట్టి కాల్ మాట్లాడాడు. ఆ ఫోన్ పేలిపోయింది. తీవ్రమైన గాయాలతో ఆ వయోధికుడు మరణించాడు.

టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం, బర్నగర్ తహశీల్‌కు చెందిన దయారాం బరోడ్ ఫోన్‌లో మాట్లాడుతుండగా మరణించాడు. చార్జింగ్ పెట్టిన ఆ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో దయారాం తల, ముఖం, ఛాతికి తీవ్ర గాయాలు అయ్యాయని సబ్‌డివిజినల్ పోలీసు ఆఫీసర్ రవీంద్ర బోయత్ వివరించారు. ఈ ప్రమాదం జరిగతినప్పుడు దయారాం తన మిత్రుడు దినేశ్‌తో మాట్లాడుతున్నాడు. వారు ఓ వ్యక్తి అంత్యక్రియల గురించి మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగినట్టు తెలిసింది.

దయారాంతో మాట్లాడుతుండగా కాల్ హఠాత్తుగా కట్ అయిపోయిందని దినేశ్ చెప్పాడు. మళ్లీ ఫోన్ చేస్తే కలువలేదని వివరించాడు. దీంతో అనుమానంతో తాను దయారాం ఇంటికి వెళ్లానని తెలిపాడు. దయారాం తన తండ్రి మరణించాక రునిజా రోడ్‌లోని ఇంటిలో నివసిస్తున్నాడు. దినేశ్ ఆ ఇంటికి వెళ్లాడు. అక్కడ దారుణమైన దృశ్యాలు దినేశ్‌కు కనిపించాయి. దయారాం విగత జీవై కనిపించాడు. పలు గాయాల నుంచి రక్తం చిందిన దృశ్యాలు కనిపించాయి. 

Also Read: ‘తల్లిపాల బ్యాంక్’ ఏర్పాటు చేయనున్న ఉత్తరాఖండ్

ఆ మొబైల్ ఫోన్ పేలిపోయిందని ఫోరెన్సిక్ టీమ్ కనుగొందని బోయత్ తెలిపారు. చార్జర్ స్విచ్ బోర్డుకు కనెక్ట్ చేసే ఉన్నది. అది కూడా కాలిపోయి నల్లగా మారింది. బరోడ్ ఉపయోగించిన ఫోన్, చార్జర్‌ను ఫోరెన్సిక్ టీమ్ స్వాధీనం చేసుకుని ల్యాబ్‌కు తీసుకెళ్లింది. దయారాం మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి వీటిని వెంట తీసుకెళ్లింది.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu